అమెరికాపై అభిమానం చాటుకున్న ఎన్ఆర్ఐ కుటుంబం .. భారత్‌లోని ఇంటిపై ‘‘ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ’’

అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ( Statue of Liberty ) భారీ విగ్రహం స్వేచ్ఛ , సమానత్వానికి ప్రతీకగా నిలుస్తుంది.జాతి, మతం, ప్రాంతం, రంగు వంటి వివక్ష లేకుండా దేశ ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు , దేశంలోని ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా బతికేందుకు ఈ ప్రతిమ పూచీకత్తు వహిస్తుంది.

 Nri Family Installs Statue Of Liberty Replica At Punjab Home Details, Nri Family-TeluguStop.com

అమెరికా పర్యటనకు ప్రత్యేకించి న్యూయార్క్‌కు( New York ) వెళ్లిన ప్రతి ఒక్కరూ ఈ విగ్రహాన్ని చూడకుండా తిరిగి రారంటే అతిశయోక్తి కాదు.యునైటెడ్ స్టేట్స్ గుర్తింపుకు పర్యాయపదంగా నిలిచే ఈ 305 అడుగుల ఎత్తైన విగ్రహం ఇప్పుడు భారతదేశంలోని పంజాబ్‌ రాష్ట్రంలోని( Punjab ) ఒక మారుమూల గ్రామంలో కనిపించింది.

పంజాబ్‌లోని మోగా జిల్లా( Moga District ) పరిధిలోని లాంగియానా నవాన్ గ్రామంలోని వారి ఇంటిపై ఒక ఎన్ఆర్ఐ కుటుంబం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ప్రతిరూపాన్ని ఏర్పాటు చేసింది.ప్రస్తుతం అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో స్థిరపడిన ఆ కుటుంబ పెద్ద ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.

ఈ విగ్రహం అమెరికాకు( America ) తమ నివాళి అన్నారు.ఘల్ కలాన్ గ్రామానికి చెందిన శిల్పి మంజిత్ సింగ్ గిల్( Sculptor Manjit Singh Gill ) రూపొందించిన 18 అడుగుల ఎత్తైన లిబర్టీ విగ్రహం ఫైబర్ గ్లాస్‌తో తయారు చేయబడింది.

Telugu Moga, Nri, Punjab, Punjab Nri, Statue Liberty, Statueliberty-Telugu NRI

ఇంటి యజమాని గుర్మీత్ సింగ్ బ్రార్( Gurmeet Singh Brar ) అలియాస్ బాబు (46) మాట్లాడుతూ.ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశమైన అమెరికాలో స్థిరపడాలని తాను ఎప్పుడూ కలలు కన్నానని చెప్పారు.తాను 2006లో అమెరికాకి వెళ్లి తన రవాణా వ్యాపారాన్ని ప్రారంభించానని బ్రార్ వెల్లడించారు.అక్కడికి వెళ్లిన తర్వాత తమ వ్యాపారం అభివృద్ధి చెందడమే కాదు.మంచి జీవితాన్ని కూడా గడుపుతున్నామని తెలిపారు.

Telugu Moga, Nri, Punjab, Punjab Nri, Statue Liberty, Statueliberty-Telugu NRI

అందుకే పంజాబ్‌లోని తమ ఇంటిలో అమెరికాకు సంబంధించిన విగ్రహం ఉండాలని అనుకున్నప్పుడు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ గుర్తుకు వచ్చిందని బ్రార్ పేర్కొన్నారు.తన తాతను మోగాలోని ప్రజలు ఇప్పటికీ గుర్తించుకుంటానని.మా నాన్న అక్కడ ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్ ప్రారంభించి ఇన్నాళ్లు విజయవంతంగా నడిపారని , ఈ దేశం తమ కుటుంబానికి చాలా ఇచ్చిందని బ్రార్ తెలిపారు.

అందుకే ప్రతి ఏడాది కనీసం ఒక్కసారైనా పంజాబ్‌ని సందర్శిస్తానని చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube