మట్టి ఇల్లు అని చులకనగా చూడకండి.. లోపల చూస్తే ఇంద్రభవనమే..?

ఒకప్పుడు భారతదేశం( India )లో పాటు అనేక ప్రాంతాలలో మట్టితో ఇల్లు కట్టుకునేవారు.డబ్బులు లేక సిమెంటు ఇళ్లను తట్టుకోలేకపోయేవారు.

 Don't Take It For Granted That It Is A Mud House It Looks Like A Dream House , V-TeluguStop.com

పేదవాళ్లు మాత్రమే ఈ మట్టి ఇళ్లను కట్టుకుంటారు.బయట ఎలా మామూలుగా ఉన్నాయో లోపల కూడా ఈ ఇల్లు ఏమీ సౌకర్యాలు లేకుండా ఏదో తలదాచుకోవడానికి గుడిసె కట్టుకున్నట్లుగా ఉంటాయి.

అయితే అన్ని మట్టి ఇల్లులు అలానే ఉంటాయనుకుంటే పొరపాటే.ఎందుకంటే ఒక ఇల్లు మనం ఊహించిన దానికి భిన్నంగా ఉంది.

అది సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా మారింది.ఆ ఇంటి బయట చూస్తే పేదవాళ్ళ ఇల్లులా ఉంది.

కానీ లోపలికి వెళ్లగానే అందరూ షాక్ అయ్యారు! ఎందుకంటే లోపల అంత అందంగా ఉంది మరి.ఇంటి ముందు తెల్లటి కర్టెన్ వేలాడుతోంది.పైకప్పు రేకులు, టీన్‌తో క్లోజ్ చేశారు.కానీ లోపలికి వెళ్ళగానే, ఒక ఇంద్ర భవనం లాంటి దృశ్యం కనిపిస్తుంది.కార్పెట్లతో ఈ ఇంటి లోపల అలంకరించారు, కరెంటు మంచి లైట్లు ఇంకా అనేక సౌకర్యాలు కూడా ఉన్నాయి.అందువల్ల ఇది రాజభవనంలోకి వెళ్లినట్టుగా అనిపిస్తుంది.

గదిని చుట్టుపక్కలా అందమైన డిజైన్‌ ఉన్న దిండ్లు కూడా ఉన్నాయి.అక్కడ వేడి చేసే యంత్రాన్ని కూడా చూడొచ్చు.

ఇంకా లోపలికి వెళ్లగా, వాక్యూమ్ క్లీనర్, అద్దాలు, చిన్న చిత్రాలు కూడా కనిపిస్తాయి.అంటే, బయట చూస్తే చిన్నబోయే ఇల్లు లోపల చాలా సౌకర్యవంతంగా ఉంది.ఇల్లు చాలా చక్కగా అలంకరించబడింది.చాలా విశాలంగా కూడా ఉంది.ఇంటి కిటికీలన్నీ తెల్లని కర్టెన్లతో కవర్ చేశారు, బయటి నుంచి వచ్చే వెలుతురు ఇంటిని లోపల నుంచి చాలా అందంగా కనిపించేలా చేస్తుంది.

ఈ వైరల్ వీడియో క్యాప్షన్ ప్రకారం, ఈ ఇల్లు అజర్‌బైజాన్‌( Azerbaijan ) దేశంలోని ఒక గ్రామంలో నివసించే ఒక సంచార వ్యక్తికి చెందినది.క్యాప్షన్‌లో “రైతులు, సంచార వ్యక్తుల రోజువారీ జీవితం, అజర్‌బైజాన్ గ్రామాల డాక్యుమెంటరీ, జానపద కళ, సంప్రదాయ సంగీతం వీటన్నింటినీ Arpachay’s ఇన్‌స్టాగ్రామ్ పేజీలో చూడవచ్చు.” అని రాశారు.ఇంటి అందాన్ని చూసి చాలా మంది వ్యక్తులు కామెంట్లలో తమ అనుభవాలను పంచుకున్నారు.”ఈ మట్టి ఇల్లు అందాలను చూస్తుంటే.” అని ఒక యూజర్ రాశారు.” డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్” అని మరొక వ్యక్తి రాశారు.“సుభానాల్లాహ్” అని రాస్తూ, ఇంటి డిజైన్, ఆలోచనను మరి కొంతమంది ప్రశంసించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube