తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) గురువారం కడపలో ప్రజాగళం నిర్వహించారు.ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన రోడ్ షోలో వైసీపీ( YCP ) ప్రభుత్వంపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
ఈసారి కడపలో మార్పు కనిపిస్తుంది.ప్రజా స్పందన అద్భుతంగా ఉంది.
కడపలో రౌడీయిజం పనిచేయటంలో అసెంబ్లీ అభ్యర్థి మాధవి రెడ్డి ( Candidate Madhavi Reddy )కరెక్ట్ పర్సన్ అంటూ కొనియాడారు.వైయస్ రాజశేఖర్ రెడ్డి తో నేను 45 సంవత్సరాలు రాజకీయాలు చేయడం జరిగింది.
కానీ జగన్ లాంటి రాజకీయ నాయకుడిని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు.ఈ ముఖ్యమంత్రి ఒక అహంకారి.
ఆయన వ్యక్తిత్వం సైకో మాదిరిగా ఉంటుందంటూ వ్యాఖ్యానించారు.వైయస్ రాజశేఖర్ రెడ్డి( YS Rajasekhar Reddy ) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.ఇతన్ని భరించలేక బెంగళూరుకి పంపించేశారు అని చంద్రబాబు సంచలన కామెంట్స్ చేశారు.గౌరవం తెలియని వ్యక్తి.సంస్కారం నేర్చుకొని వ్యక్తి.అదేవిధంగా చాలా విద్వాంసకారుడు అని చంద్రబాబు విమర్శించారు.
వైసీపీకి ఓటేస్తే మీ ఇంటికి వచ్చేది గొడ్డలేనని కడప ప్రజాగళం సభలో టీడీపీ చీఫ్ చంద్రబాబు విమర్శించారు.నేరాలు-ఘోరాలు చేయడంలో జగన్ పీహెచ్ డీ చేశారని మండిపడ్డారు.
వైఎస్ఆర్ చనిపోతే మిత్రుడిని కోల్పోయామని బాధపడ్డామని, కానీ జగన్ మాత్రం అంత్యక్రియలకు ముందే సీఎం కావాలని సంతకాల సేకరణ చేపట్టాడని ఆరోపించారు.రాష్ట్రాన్ని కాపాడుకోవాలనేదే కూటమి ఆలోచనని, అందుకు అందరం త్యాగాలు చేశామని చంద్రబాబు గుర్తు చేశారు.