ఇటీవల కాలంలో కొంతమంది పాస్టర్లు ఏదో ఒక చట్ట విరుద్ధమైన పని చేసి వార్తల్లో నిలుస్తున్నారు.వీరు చేస్తున్న పనులు తెలుసుకుని సామాన్యులు షాక్ అవుతున్నారు.
ఇలాంటి మరొక పాస్టర్ గురించిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది.చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తున్న లారెన్స్ కోజక్( Lawrence Kozak ) అనే వ్యక్తి మొబైల్ గేమ్స్ అంటే ఎక్కువ ఆసక్తి ఉండేది.
కానీ ఆ ఆసక్తి అతనికి ఊహించని ఇబ్బందిని తెచ్చిపెట్టింది.చర్చికి సంబంధించిన నలభై వేల డాలర్లకు పైగా (దాదాపు 33 లక్షల రూపాయలు) డబ్బుని దొంగతనం చేసి ఆ డబ్బుతో క్యాండీ క్రష్( Candy Crush ), మారియో కార్ట్ వంటి ఆటల్లో అదనపు ఫీచర్లు కొనుగోలు చేశాడు.
ఈ ఆరోపణపై అరెస్ట్ కూడా అయ్యాడు.అంతేకాకుండా ఆయన తన దత్తపుత్రికి ఖరీదైన బహుమతులు కూడా కొన్నారు.
సాధారణంగా ఎవరైనా వ్యక్తిగత డబ్బుతో గేమ్స్ ఆడడం, వాటిలో ఫీచర్లు కొనడం పెద్ద విషయం కాదు.కానీ ఫాదర్ కోజక్ చర్చికి చెందిన క్రెడిట్ కార్డుని వాడుకుని ఈ ఖర్చులు చేశారనేది ఇక్కడ సమస్య.2022లో ఆయన ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్న డబ్బు విషయం బయటపడింది.చర్చి ఆయన యాపిల్ ఐడికి సంబంధించిన ఖాతాలో చాలా ఎక్కువ ఖర్చులు కనిపించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
దీనితో ఆయనను సెయింట్ థామస్ మోర్ చర్చి( St Thomas More Church ) నుంచి తొలగించడమే కాకుండా, ఆయన బాధ్యతల నుంచి కొంతకాలం తప్పించారు.
51 ఏళ్ల మాజీ పాస్టర్ లారెన్స్ కోజక్‌పై ఏప్రిల్ 25, 2024న అధికారికంగా దొంగతనం, దానికి సంబంధించిన ఇతర నేరాల ఆరోపణలు చేశారు.పోలీసులు ఆయనను విచారించినప్పుడు, ఆన్‌లైన్ గేమ్‌లపై ఎక్కువ ఖర్చు చేయడం వల్ల కలిగే సమస్యలకు చికిత్స తీసుకుంటున్నట్లు ఫాదర్ కోజక్ తెలిపారు.చర్చి క్రెడిట్ కార్డు( Church credit card )ను ఉపయోగించాలని తాను ఉద్దేశపూర్వకంగా భావించలేదని ఆయన స్పష్టం చేశారు.
చర్చికి కావలసిన వస్తువులు, స్ట్రీమింగ్ సేవలు, ఆఫీస్ ప్రోగ్రామ్‌ల వంటివి కొనుగోలు చేయడానికి ఆ కార్డును తన ఫోన్‌లో సేవ్ చేసి ఉండటం వల్లే అలా జరిగిందని వివరించారు.అయితే, తాను తగినంత శ్రద్ధ వహించకపోవడం వల్ల తప్పుగా ఆ కార్డును వాడి ఉండవచ్చని కూడా ఆయన అంగీకరించారు.
ఈ రికార్డ్‌ల ప్రకారం, ఫాదర్ కోజక్ తన సొంత డబ్బులోంచి $10,000 (దాదాపు 8 లక్షల రూపాయలు) తీసుకుని క్రెడిట్ కార్డ్ బకాయిలో కొంత భాగాన్ని చెల్లించడానికి ప్రయత్నించాడని తెలుస్తోంది.అతను అరెస్ట్ అయిన తర్వాత కూడా చర్చికి $8,000 (సుమారు 6 లక్షల రూపాయలు) చెక్ రాయించి, తన తప్పుకు క్షమాపణలు తెలిపాడు.