చిరంజీవినే అవమానిస్తారా ? జగన్ పై పవన్ ఫైర్ 

వైసీపీ అధినేత , ఏపీ సీఎం జగన్ పై( CM Jagan ) జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తీవ్ర స్థాయి లో మండి పడ్డారు.  మెగాస్టార్ చిరంజీవి అంశాన్ని ప్రస్తావిస్తూ జగన్ పై నిప్పులు చెరిగారు.

 Pawan Kalyan Fires On Cm Jagan For Disrespecting Chiranjeevi Details, Jagan, Ysr-TeluguStop.com

  మన అభిమాన హీరో చిరంజీవిని( Chiranjeevi ) అవమానించిన జగన్ ను ఇంటికి సమయం ఆసన్నమైంది అంటూ పవన్ వ్యాఖ్యానించారు.ఈరోజు మండపేట బహిరంగ సభలో మాట్లాడిన పవన్ ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి చేస్తామని , కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేస్తామని, రైతాంగానికి తోడ్పటు అందిస్తామని అన్నారు.

కేంద్రం నుంచి వచ్చే నిధులు నేరుగా పంచాయతీలకు కేటాయిస్తామని అన్నారు.పోలీస్ , రెవెన్యూ వ్యవస్థలను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు.  జగన్ నాయకత్వంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం రాష్ట్ర సంపదను దోచేస్తుందని విమర్శించారు.

Telugu Ap Cm Jagan, Ap, Cm Jagan, Jagan, Janasenani, Mandapeta, Chiranjeevi, Pav

2014లో టిడిపి బిజెపి కి జనసేన మద్దతు ఇవ్వడం వల్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని పవన్ గుర్తు చేశారు.కులాలను దాటి వెళ్ళకపోతే రాష్ట్రం నాశనం అవుతుందని అన్నారు.  తోట త్రిమూర్తులు,( Thota Trimurthulu )  పిల్లి సుభాష్ చంద్రబోస్( Pilli Subhash Chandrabose ) రాజకీయ శత్రువులని,  ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం కలిసిపోయారని విమర్శించారు.

  తోట త్రిమూర్తులు జనసేనలోకి రావడం లేదని క్లారిటీ ఇచ్చారు.  ద్రాక్షారామంలో కాపు కళ్యాణమండపం నిర్మాణం చేపడతామని చెప్పి స్థలం కాజేసి రెండేళ్లుగా కళ్యాణ మండపం నిర్మించలేదని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Telugu Ap Cm Jagan, Ap, Cm Jagan, Jagan, Janasenani, Mandapeta, Chiranjeevi, Pav

ఏపీని జగన్ పాలన నుంచి విముక్తి చేయాలని  ప్రజలను కోరారు .గంజాయి పండించే వైసీపీ నేతలు లాభాల్లో ఉన్నారని,  మూడు వేల మంది కౌలు రైతులు చనిపోయారని , పంట నష్టం వల్ల రాష్ట్రవ్యాప్తంగా రైతులు 960 కోట్లు నష్టపోయారని పవన్ అన్నారు.  మండపేట నియోజకవర్గం లో నాలుగు ఇసుక రీచ్ ల నుంచి జగన్ నేలకు 10 కోట్లు దోచుకుంటున్నారని పవన్ విమర్శించారు.  క్లాస్ వార్ అంటున్న జగన్ అందరి సంపద దోచుకుంటున్నారని , ధైర్యం లేని సమాజం చచ్చిపోతుంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ఉంటే ఒక్కొక్కరి తాట తీసేస్తా అంటూ హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube