అకాల వర్షాల నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి : పౌర సరఫరాల కమీషనర్ డి.ఎస్. చౌహాన్

రాజన్న సిరిసిల్ల జిల్లా :అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పర్యవేక్షణ చేయాలని పౌర సరఫరాల శాఖ కమీషనర్ డి.ఎస్.

 Due Precautions Should Be Taken In The Wake Of Untimely Rains, Civil Supplies Co-TeluguStop.com

చౌహాన్ ఆదేశించారు.సోమవారం ధాన్యం కొనుగోళ్ళ ప్రక్రియపై పౌర సరఫరాల కమీషనర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యా నాయక్ హాజరయ్యారు.రాబోయే 3 రోజులలో ఆకాల వర్షాలు ఉన్నందున అన్ని కొనుగోలు కేంద్ర నిర్వాహకులు, రైతులు వరి ధాన్యమును వర్షం వలన తడవకుండ తగు జాగ్రత్తలు తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ కమీషనర్ ఆదేశించారు.

జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా అవసరమైన గోనె సంచులను, టార్పాలిన్లను రైతులకు అందుబాటులో ఉంచాలని అన్నారు.అలాగే కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు.గత సంవత్సరం ఏప్రిల్ నెల 25 వ తేదీన జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించడం జరిగిందని, కానీ ఈ సంవత్సరం ఇప్పటి వరకు జిల్లాలో 5,379 రైతుల వద్ద నుండి 82.13 కోట్ల విలువ గల 37,280 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని, ఇందుకు గాను 17.37 కోట్లు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని, ఈ రోజు వరకు మొత్తం 33986 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులకు రవాణా చేశామని అదనపు కలెక్టర్ వివరించారు.ధాన్యం తరలింపులో క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని, మండల తహసిల్దార్ లు, పౌరసరఫరాల శాఖ, మార్కెటింగ్, జిల్లా సహకార అధికారి (డీసీవో – ఫ్యాక్స్ ), రూరల్ డెవలప్మెంట్ (ఐకేపీ) మరియు రవాణా విభాగాలు మరింత సమన్వయంతో పనిచేస్తున్నాయని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పౌర సరఫరాల అధికారి జితేందర్ రెడ్డి, పౌర సరఫరాల మేనేజర్ జితేంద్ర ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube