ఎన్నికల ప్రచారంలో భాగంగా జగ్గంపేటలో జరిగిన సభలో చంద్రబాబు( Chandrababu ) సంచలన వ్యాఖ్యలు చేశారు.వైసీపీ( YCP ) నాయకుడు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై( Sajjala Ramakrishna Reddy ) చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
సినిమా వాళ్ళను ఇంటికి పిలిచి మరి అవమానించిన నీచుడు జగన్ అని మండిపడ్డారు.సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లను తాను ఎంతగానో గౌరవించినట్లు చెప్పుకొచ్చారు.
పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవి ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు.ఆయనకు సమాజంలో గౌరవం ఉంది.
అందుకే కేంద్రం పద్మ విభూషణ్ అవార్డుతో( Padma Vibhushan award ) సత్కరించింది.సజ్జల లాంటి బ్రోకర్… ఎప్పుడూ ఎమ్మెల్యేగా కాని వ్యక్తి.
సాక్షి ఆఫీసులో గుమస్తాగా పని చేసే వ్యక్తి చిరంజీవిని విమర్శించే పరిస్థితి దాపరిచింది.
ఇది న్యాయమేనా.? వీళ్ళకి బలుపు తగ్గించాలి.అని అన్నారు.
పవన్ వ్యక్తిగత జీవితం పై మాట్లాడుతున్న నీచులు వైసీపీ నేతలని.సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో ఎన్నికలకు ఇంక మూడు వారాలు మాత్రమే సమయముంది.ప్రస్తుతం నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది.
రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలలో పోటీ చేసే వివిధ పార్టీల నేతలు.నామినేషన్ ప్రక్రియ పూర్తి చేస్తున్నారు.
ఏపీలో 2019 కంటే 2024 ఎన్నికలు పోటాపోటీగా ఉన్నాయి.తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి.
గతంలో ఈ మూడు పార్టీలు 2014లో పోటీ చేసి విజయం సాధించాయి.దీంతో ఈసారి కూడా విజయం సాధించాలని భావిస్తున్నాయి.
ఈ క్రమంలో కూటమి గెలుపు కోసం చంద్రబాబు తనదైన శైలిలో.నిర్ణయాలు తీసుకుంటూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.