“మేమంతా సిద్ధం” పేరిట వైసీపీ అధినేత వైయస్ జగన్( YS Jagan ) బస్సు యాత్ర ప్రారంభించడం తెలిసిందే.మార్చి 27వ తారీకు ఇడుపులపాయలో మొదలుపెట్టిన ఈ యాత్ర ఇచ్చాపురం వరకు సాగనుంది.
జిల్లాల వారీగా 21 రోజులపాటు సాగనున్న ఈ యాత్రలో గతంలో “సిద్ధం” సభలు ( Siddam )జరిగిన నాలుగు జిల్లాలు మినహా మిగతా 21 జిల్లాలలో నిర్వహిస్తున్నారు.ప్రస్తుతం రాయలసీమలో జరుగుతున్న ఈ బస్సు యాత్రకు జనం నుండి మంచి స్పందన వస్తూ ఉంది.
ఈ బస్సు యాత్రలో ఉదయం స్థానిక పార్టీ నేతలతో భేటీ అవుతూ సాయంత్రం బహిరంగ సభలలో సీఎం జగన్ పాల్గొంటున్నారు.
ఇదిలా ఉంటే “మేమంతా సిద్ధం” బస్సు యాత్రకు( Mematha siddam ) ఒక రోజు విరామం ప్రకటించారు.ఆదివారం ఈస్టర్ కారణంగా.బస్సు యాత్రకు సీఎం జగన్ బ్రేక్ ఇవ్వటం జరిగింది.
ఈ క్రమంలో ఈస్టర్ వేడుకలలో సీఎం జగన్ పాల్గొనబోతున్నారు.అనంతరం అనంతపురం జిల్లా శివారులోని సంజీవపురంలో సోమవారం తిరిగి జగన్ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు.ప్రస్తుతం అనంతపురం జిల్లాలో ఈ యాత్ర సాగుతోంది.2024 ఎన్నికలను వైయస్ జగన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఎట్టి పరిస్థితులలో అధికారం కోల్పోకుండా ఎక్కడికక్కడ జాగ్రత్త పడుతున్నారు.ఇంకా ఎన్నికలకు 40 రోజులు మాత్రమే సమయం ఉండటంతో పూర్తిగా ప్రజా క్షేత్రంలో ఉండే విధంగా వైసీపీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది.