ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ప్సీక్వెల్స్ హావ నడుస్తుంది.ప్రతి సినిమాకి సీక్వెల్స్ చేయాలనే ఆలోచనలో సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శక నిర్మాత ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.
ఇక అందులో భాగంగానే ఏ సినిమాకి అయిన కూడా చివర లో దానికి సిక్వెల్ ఉంది అన్నట్టుగా ప్రకటిస్తున్నారు.ఇక ఇదే క్రమంలో రవితేజ( Raviteja ) హీరోగా రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన విక్రమార్కుడు( Vikramarkudu ) సినిమాకి కూడా సీక్వెల్ తీయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన స్టోరీని రైటర్ విజయేంద్ర ప్రసాద్ కంప్లీట్ చేశాడు.అయితే ఈ సినిమాని కేకే రాధ మోహన్ నిర్మిస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఈ సినిమాకి సంపత్ నంది ( Sampath Nandi ) డైరెక్షన్ వహిస్తాడు.

అయితే ఈ సీక్వెల్ లో రవితేజ హీరోగా నటించే అవకాశాలు అయితే లేనట్టుగా కనిపిస్తుంది.ఎందుకంటే ఈ సినిమా ను రాజమౌళి( Rajamouli ) డైరెక్షన్ చేస్తేనే రవితేజ హీరోగా నటిస్తానని చెప్పినట్టుగా తెలుస్తుంది.ఇక దాంతో ఈ సినిమాలోకి హీరోగా మరొకరిని తీసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇక అందులో భాగంగానే విక్రమార్కుడు సినిమాని తమిళం లో రీమేక్ చేసి సక్సెస్ ని అందుకున్న కార్తీ ని( Karthi ) ఈ సీక్వెల్ కోసం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది.

ఇక ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలని ఆలోచనలు ఉన్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.ఇక రవితేజ కనుక ఈ సినిమా చేయకపోతే కార్తీ అయితే ఈ సినిమాకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతారంటూ చాలామంది ఆయన పేరుని సజెస్ట్ చేయడం కూడా విశేషం… ప్రస్తుతం కార్తీ షాపుల్లో ఉన్నాడు మరి ఈ సినిమాతో సక్సెస్ సాధించి ఆయన కూడా సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది…ఇక రవితేజ మార్కెట్ కి కార్తీ మార్కెట్ కి చాలా తేడా కూడా ఉంది మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది…