ప్రముఖ కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర( Upendra ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఉపేంద్ర డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్( Prasanth Neel ) సైతం ఒక సందర్భంలో ఉపేంద్ర టాలెంట్ ను ఎంతగానో మెచ్చుకున్న సంగతి తెలిసిందే.ఉపేంద్ర తనకు ఇన్స్పిరేషన్ అని ప్రశాంత్ నీల్ పలు సందర్భాల్లో వెల్లడించడం జరిగింది.
అయితే ఉపేంద్ర ఈ స్థాయిలో సక్సెస్ కావడం వెనుక ఎన్నో కష్టాలు ఉన్నాయట.ప్లేట్ పట్టుకుని భోజనం కోసం వెళ్తే అవమానాలు ఎదురైన సందర్భాలు సైతం తన జీవితంలో ఉన్నాయని ఉపేంద్ర ఒక సందర్భంలో వెల్లడించారు.
కెరీర్ తొలినాళ్లలో నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా( Assistant Director ) పని చేశానని ఉపేంద్ర కామెంట్లు చేశారు.షూటింగ్ బ్రేక్ లో నేను భోజనం కోసం ప్లేట్ తీసుకోగా ప్రొడక్షన్ కు చెందిన వ్యక్తి నాకు భోజనం పెట్టకుండా అవమానించారని ఉపేంద్ర తెలిపారు.
కెరీర్ తొలినాళ్లలో ఇలాంటి అవమానాలను చాలానే ఎదుర్కొన్నానని ఆయన కామెంట్లు చేశారు.నన్ను ఎవరైతే అవమానించే అదే వ్యక్తి నేను హీరోగా సినిమాల్లో నటించడం మొదలుపెట్టిన తర్వాత నా ప్లేట్ లో భోజనం వడ్డించాడని ఉపేంద్ర పేర్కొన్నారు.నేను అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పటికీ అలానే ఉన్నానని ఉపేంద్ర పేర్కొన్నారు.మన లైఫ్ లో జరిగే చేదు ఘటనలు మనల్ని పాజిటివ్ గా మార్చాలే తప్ప చెడుగా కాదని ఆయన చెప్పుకొచ్చారు.
నేను జీరోతో మొదలుపెట్టి ఈ స్థాయికి చేరుకున్నానని ఉపేంద్ర వెల్లడించారు.నేను సంపాదించేది నాకు ప్లస్ అవుతుందని నేను కోల్పోయేది ఏమీ లేదని ఆయన చెప్పుకొచ్చారు.ప్రస్తుతం యూఐ( UI Movie ) అనే ప్రాజెక్ట్ తో ఆయన బిజీగా ఉన్నారు.ఉపేంద్ర భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో భారీ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.