నేషనల్ క్రష్ రష్మిక మందన్న( Rashmika Mandanna ) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.నటిగా ఇండస్ట్రీలోకి ఏ విధమైనటువంటి అంచనాలు లేకుండా అడుగు పెట్టినటువంటి ఈమె ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇలా భాషతో సంబంధం లేకుండా వరుస భాషా చిత్రాలలో నటిస్తూ టాప్ హీరోయిన్గా కొనసాగుతూ ఉన్నటువంటి రష్మిక ఇటీవల కాలంలో పలు విదేశాలకు వెళ్తూ పెద్ద ఎత్తున అభిమానులను కలిసి సందడి చేస్తున్నారు.ఇటీవల జపాన్( Japan ) వెళ్లినటువంటి రష్మిక అక్కడి నుంచి ఆస్ట్రేలియాకి( Australia ) కూడా వెళ్లారు.
సినిమా పనుల నిమిత్తం అలాగే తన వ్యక్తిగత విషయాల కారణంగా విదేశాలకు వెళ్లినటువంటి రష్మిక ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చారు.అయితే తాజాగా ఫారెన్ వెళ్లినటువంటి ఈమె అక్కడ షాపింగ్ చేసిన కొన్ని వస్తువులను చూపిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.ఇందులో భాగంగా ఈమె ఎక్కువగా టెడ్డీబేర్స్( Teddy Bears ) కొన్నట్టు తెలుస్తోంది.
ఇక ఈమె ఎప్పుడు విదేశాలకు వెళ్లిన ఎక్కువగా టాయ్స్ ( Toys ) కొంటారని తాజాగా వెల్లడించారు.సాధారణంగా ఎవరైనా విదేశాలకు వెళ్తే మన దగ్గర దొరకని వస్తువులు అక్కడ దొరికితే తెచ్చుకుంటారు అంతేకాకుండా చాలామంది వివిధ రకాల బట్టలు ఇతరతా షాపింగ్ చేస్తారు.కానీ రష్మిక మాత్రం ఇలా టాయ్స్ కొనడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు టాయ్స్ అంటే రష్మికకు మరి అంత పిచ్చా విదేశాలకు వెళ్లి మరీ కొనుక్కోవాలా అంటూ కామెంట్లో చేస్తున్నారు.
ఇక ఈమె సినిమాలో విషయానికి వస్తే దాదాపు నాలుగు సినిమాలలో నటిస్తున్నారు.ఇక త్వరలోనే పుష్ప 2( Pushpa 2 ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి రష్మిక సిద్ధమవుతున్నారు.
ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ విడుదల కానుంది.