సినీ ఇండస్ట్రీలో యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో శ్యామల ( Syamala )ఒకరు.ఈమె కెరియర్ మొదట్లో పలు సీరియల్స్ లో నటించారు .
అనంతరం యాంకర్ గా ఇండస్ట్రీలో స్థిరపడ్డారు.ఇలా పలు కార్యక్రమాలకు అలాగే సినిమా ఈవెంట్లకు యాంకర్ గా చేసే ఈమె ఇటీవల కాలంలో బుల్లితెర కార్యక్రమాలకు కూడా దూరమయ్యారు.
శ్యామల ఇండస్ట్రీలో యాంకర్ గాను బుల్లితెర నటిగా కొనసాగుతున్నటువంటి సమయంలో మరొక సీరియల్ ఆర్టిస్టు నరసింహారెడ్డిని ( Narasimha Reddy ) ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు.ఇలా నరసింహారెడ్డి కూడా సీరియల్ ఆర్టిస్ట్ కావడంతో వీరిద్దరూ బుల్లితెరపై పెద్ద ఎత్తున సీరియల్స్ చేశారు అనంతరం శ్యామల యాంకర్ గా కూడా చేస్తూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు.
ఇక ఇటీవల కాలంలో శ్యామల బుల్లితెర కార్యక్రమాలను కూడా తగ్గించి కేవలం యూట్యూబ్ వీడియోలను చేస్తూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు.ఈమె బిగ్ బాస్ ( Bigg Boss ) కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి తరువాత యూట్యూబ్ ఛానల్ ద్వారా మాత్రమే ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఇక నరసింహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత శ్యామలకు తన భర్త ఒక కండిషన్ పెట్టారు అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె వెల్లడించారు నేను మా ఆయనని పెళ్లి చేసుకోవడానికి ముందు తను నాకు ఒక కండిషన్ పెట్టారు.అదేంటంటే నువ్వు టీవీ సీరియల్స్ లో ఎన్నైనా నటించు కానీ సినిమాలో మాత్రం చేయకూడదు సినిమాలలో నటించడం నాకే మాత్రం ఇష్టం లేదు అంటున్న తనకు కండిషన్ పెట్టారట ఇదే విషయమే మా ఇద్దరి మధ్య జరిగిన మొదటి అగ్రిమెంట్ అంటూ శ్యామల తెలిపారు.
ఇక నేను సినిమాలలో నటించడం ఆయనకు ఇష్టం లేకపోవడంతో అటువైపు వెళ్లాలని ఆలోచన కూడా పెట్టుకోలేదని తెలిపారు.అయితే ఒకసారి పండుగ కోసం మేము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాక అక్కడ నాకు గుండెల్లో గోదారి( Gundello Godari ) సినిమాలో నటిస్తారా అని ఫోన్ కాల్ వచ్చిందని ఈమె తెలిపారు.దాంతో నేను లేదు నేను చేయను మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అంటూ చెప్పాను.అప్పుడు మా అత్తయ్య విని ఏంటి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అంటున్నావు అని అడిగారు.
ఇలా సినిమాలలో చేయమని అవకాశం వచ్చింది అత్తయ్య కానీ మీ అబ్బాయికి ఇష్టం లేదు అందుకే చేయను అని చెప్పాను అంటే టీవీకి సినిమాకి పెద్ద తేడా ఏం లేదు ఎందుకు వద్దని చెబుతున్నావువెళ్లి చెయ్యి నేను ఒప్పిస్తాను అని నరసింహారెడ్డిని ఒప్పించారని అలా తాను సినిమా ఇండస్ట్రీలోకి కూడా వచ్చానని శ్యామల తెలిపారు.ఇక ఈ సినిమా తర్వాత ఒక లైలా కోసం లౌక్యం వంటి సినిమాలలో నటించానని ప్రస్తుతం తాను ఏం చేసినా తన ఫ్యామిలీ సపోర్ట్ తనకు బాగా ఉందని శ్యామల చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.