ప్రస్తుత పోటీ ప్రపంచంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు ఏ స్థాయిలో డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.సాఫ్ట్ వేర్ జాబ్ లో చేరితే మాత్రమే లైఫ్ ఉంటుందని చాలామంది ఫీలవుతున్నారు.
అయితే ఇద్దరు వ్యక్తులు మాత్రం సాఫ్ట్ వేర్ జాబ్స్ ను వదిలేసి లక్షల్లో సంపాదిస్తున్నారు.లీటర్ గాడిద పాలను 7 వేల రూపాయలకు విక్రయిస్తూ ప్రశంసలు అందుకోవడంతో పాటు ఆదాయాన్ని పెంచుకుంటున్నారు.
గాడిదల ఫారం పెట్టుకుంటే కచ్చితంగా లాభాలు వస్తాయని కిరణ్, నవ్య( Kiran, Navya ) ప్రూవ్ చేశారు.తూర్పు గోదావరి జిల్లా రాజానగరంకు చెందిన మల్లంపూడిలో అక్షయ పేరుతో ఎన్.కిరణ్ కుమార్ గాడిదల ఫారంను మొదలుపెట్టారు.ఐఐటీ స్టూడెంట్ నవ్య గంపాలతో కలిసి 120 గాడిదలతో ఫారంను ఏర్పాటు చేశారు.
గాడిద పాలను నిల్వ చేసి ఆన్ లైన్ ద్వారా కూడా కిరణ్ విక్రయిస్తూ ఉండటం గమనార్హం.
ఫార్మా, కాస్మెటిక్స్ కంపెనీలు( Pharma , cosmetics companies ప్రధానంగా గాడిద పాలను కొనుగోలు చేస్తున్నాయని కిరణ్ కుమార్ చెబుతున్నారు.గాడిద మూత్రాన్ని కిలో 400 రూపాయల చొప్పున ఆయుర్వేద ఫార్మసీలకు, పేడను కిలో 250 రూపాయల చొప్పున అగర్ బత్తుల కంపెనీలకు అమ్ముతున్నానని కిరణ్ కుమార్ వెల్లడిస్తున్నారు.వైరల్ జ్వరాలు, కోరింత దగ్గు, ఇన్ఫెక్షన్లకు మందుగా గాడిద పాలను వాడతారు.
గాడిద పాల( donkey milk ) వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.గాడిదలను చులకనగా చూడొద్దని గాడిదల ఫారంతో కోట్లు సంపాదించవచ్చని కిరణ్, నవ్య ప్రూవ్ చేశారు.కిరణ్, నవ్య వ్యాపారాలకు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలు వస్తుండటం గమనార్హం.కోళ్ల ఫారం, పశువుల ఫారం వ్యాపారాలు చేస్తే లాభాలు వస్తాయో రావో చెప్పలేం కానీ గాడిదల ఫారం బిజినెస్ మాత్రం కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.