మానవులు పెంపుడు జంతువులుగా ఉంచుకోగలిగే అత్యంత నమ్మకమైన జంతువులు కుక్కలు( dogs ).కుక్కలు తమ యజమానులతో విడదీయారని బంధాన్ని ఏర్పరుచుకుంటాయి.
ఒక్కసారి యజమానికి దగ్గరైతే వారిని రక్షించడానికి అవి ఏదైనా చేస్తాయి.కుక్కలు ఓనర్లను తాకడానికి, ఆడుకోవడానికి బాగా ఇష్టపడతాయి.
కానీ కొంతమంది ఓనర్లకు రోజులో ఎక్కువ గంటలు పని చేయాల్సి ఉంటుంది.ఫలితంగా కుక్కలతో ఆడుకోవడానికి వారికి సమయం సరిపోదు.
అయితే బెంగళూరులో ఆటో నడుపుతున్న ఓ వ్యక్తి ఈ సమస్యకు పరిష్కారం కనుగొన్నాడు.అతను తన ఆటో రిక్షాలో తన కుక్కను తనతో పాటు తెచ్చుకోవడం స్టార్ట్ చేశాడు.
తనను ప్రాణంగా ప్రేమించే దానిని తన ఒడిలో కూర్చోబెట్టి ఆటో డ్రైవ్ చేస్తున్నాడు.
దీన్ని ఎవరో వీడియో రికార్డ్ చేసి పావ్‌ఫుల్ వరల్డ్( Pavful World ) అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు.ఆ వీడియోలో, “ఈరోజు ఒక ఆటో డ్రైవర్ తన హూమన్‌ను రైడ్‌కి తీసుకెళ్లడం చూశాను! ఉబర్ డ్రైవర్ పేరు టామీ.” అని సరదాగా క్యాప్షన్ జోడించారు.ఈ వీడియో బాగా పాపులర్ అయింది.చాలా మంది వ్యక్తులు ఈ కుక్క పట్ల ఆ వ్యక్తి చూపిస్తున్న దయకు ఫిదా అయ్యారు.
వైరల్ వీడియోలో బెంగళూరులోని( Bangalore ) రద్దీగా ఉండే ఓ వీధిని మనం చూడవచ్చు.ఆటో రిక్షా ట్రాఫిక్‌లో ఆగింది.మరొక వాహనంలో ఉన్న వ్యక్తి అతని కుక్కను చూశారు.కుక్క మనిషి ఒడిలో కూర్చొని ఆటో రిక్షా హ్యాండిల్‌బార్‌ను( Auto rickshaw ) తన పాదాలతో పట్టుకుంది.
ట్రాఫిక్ లైట్ గ్రీన్ గా మారడంతో, ఆ వ్యక్తి ఆటో రిక్షా నడుపుతూ తన కుక్కతో రైడ్‌ను ఎంజాయ్ చేశాడు.ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో 4 లక్షల దాక వ్యూస్, 35 వేల దాక కంటే లైక్స్ పొందింది.
బెంగళూరులోని ప్రజలు కుక్కలను ఎంతగానో ప్రేమిస్తారని వీడియో చూసి వారు కామెంట్లు చేస్తున్నారు.తాము 10 ఏళ్లుగా బెంగళూరులో నివసిస్తున్నామని, వీధి కుక్కలను ప్రజలు ఎంత మంచిగా చూసుకుంటున్నారో చూశామని ఆ వ్యక్తి చెప్పాడు.భారతదేశంలోని ఇతర నగరాలు కూడా ఇలాగే చేయాలని ఆకాంక్షించారు.అలాంటి స్వీట్ మూమెంట్స్ చూడగలిగితే బెంగళూరులో ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయినా తమకు అభ్యంతరం లేదని మరొకరు వ్యాఖ్యానించారు.ప్రతి కుక్క కూడా ఈ కుక్కలా సంతోషంగా ఉంటుందని తాము ఆశిస్తున్నామని మరో యూజర్ తెలిపాడు.