ప్రస్తుతం తెలుగులోనే కాదు పాన్ ఇండియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న స్టార్ హీరో రామ్ చరణ్( Ram Charan ) త్రిబుల్ ఆర్ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని ఏర్పాటు చేసుకోవడమే కాకుండా బాలీవుడ్ జనాలను సైతం తన అభిమానులుగా మార్చుకున్నాడు.దాంతో గ్లోబల్ స్టార్ గా( Global Star ) కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను అయితే సంపాదించుకున్నాడు.
ఇక ఇప్పుడు శంకర్ డైరెక్షన్ లో గేమ్ చెంజర్( Game Changer Movie ) అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో కనక భారీ సక్సెస్ ని అందుకుంటే పాన్ ఇండియా స్థాయిలో తన క్రేజ్ తార స్థాయిలోకి వెళ్ళిపోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోశక్తి లేదు.
ఇక ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు( Buchibabu ) డైరెక్షన్ లో కూడా మరొక సినిమా చేయబోతున్నాడు.ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ అయిన చేయడానికి నేను రెఢీ గా ఉన్నాను అంటూ తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా గుర్తించబడుతున్న సూర్య( Surya ) చెప్పడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.అయితే సూర్యకి రామ్ చరణ్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అని రంగస్థలం సినిమాలో తన నటన చూసి ఫిదా అయిపోయా అంటూ సూర్య ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు.
ఇక ఇప్పుడు త్రిబుల్ ఆర్( RRR ) సినిమాతో తను పాన్ ఇండియా హీరోగా ఒక మంచి గుర్తింపును అయితే తెచ్చుకున్నాడు.ఒక మొత్తానికైతే రామ్ చరణ్ తన నటనతో ప్రేక్షకుల్లోనే కాకుండా హీరోల్లో కూడా అభిమానులను సంపాదించుకుంటున్నాడు అంటూ మెగా అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు…ఇక ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ ప్రస్తుతం తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవడానికే భారీగా కష్టపడుతున్నట్టుగా తెలుస్తుంది.