తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కి ( Pawan Kalyan ) ఉన్న క్రేజ్ మరే హీరోకి లేదని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా స్టార్ హీరోగా కూడా కొనసాగుతున్నాడు.
ఇక ఇది ఇలా ఉంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కి ఖుషి సినిమా తర్వాత ఒక్క సక్సెస్ కూడా దక్కలేదు.దానికి కారణం ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ లో లోపమే అంటూ చాలామంది అతన్ని విమర్శించారు.
ఇక బాలు సినిమాతో( Balu Movie ) ఆయనకు భారీ బ్లాక్ బస్టర్ హిట్ పడుతుందని అందరూ అనుకున్నారు.కానీ అందరి ఆశలను తలకిందులు చేస్తూ ఆ సినిమా ప్లాప్ అయింది.ఇక దానికి కారణం ఏంటి అంటే అప్పటివరకు పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు తగ్గట్టుగా ఆ కథ అనేది సెట్ అవ్వలేదు.ఇక దానికి తగ్గట్టుగానే ఫ్లాష్ బ్యాక్ లో( Flashback Scene ) హీరోయిన్ కి పవన్ కళ్యాణ్ కి మధ్య వచ్చే లవ్ సెట్ అయ్యే సమయం లో రౌడీలు ఆ అమ్మాయిని చంపేయడం అనేది ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు.
ఈ రెండు మేజర్ కారణాల వల్ల ఈ సినిమా ఫ్లాప్ అయింది.
నిజానికి ఈ సినిమాని ఇప్పుడు మనం చూసినట్లయితే చాలా ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే తో సూపర్ గా ఉంటుంది.అయినప్పటికీ ఈ సినిమా అప్పట్లో మాత్రం పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయింది.ఈ సినిమా పవన్ కళ్యాణ్ కి ఒక సపరేట్ ఇమేజ్ ని తీసుకొచ్చి పెట్టిందనే చెప్పాలి… కానీ సినిమా కమర్షియల్ గా వర్కౌట్ కాకపోవడంతో ఈ సినిమా అప్పట్లో ప్రొడ్యూసర్లకు నష్టాలను మిగిల్చిందనే చెప్పాలి.
ఇక ఈ సినిమా డైరెక్టర్ అయిన కరుణాకరన్( Karunakaran ) పవన్ కళ్యాణ్ తో అంతకుముందు తొలిప్రేమ( Tholiprema ) అనే సినిమా తీసి భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు కానీ ఈ సినిమాతో మాత్రం ఒక డిజాస్టర్ ని మూటగట్టుకున్నాడు…
.