ఈ జనరేషన్ లో చాలామంది తల్లీదండ్రులు పిల్లల్ని ఒత్తిడితో చదివించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.అయితే ఎలాంటి ఒత్తిడి లేకుండా చదివి సంవత్సరానికి 50 లక్షల రూపాయల ప్యాకేజ్ తో చల్లా సాయికృతి( Challa Saikriti ) జాబ్ ఆఫర్ ను సొంతం చేసుకున్నారు.
చల్లా సాయికృతి తన సక్సెస్ స్టోరీ గురించి చెబుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.బాల్యం నుంచి హైదరాబాద్ లోనే చదివానని ఆమె అన్నారు.
నాన్న మహీధర్ ( Mahidhar ) ప్రాజెక్ట్ మేనేజర్ పని చేస్తున్నారని సాయికృతి చెప్పుకొచ్చారు.అమ్మ ఉషారాణి ( Usharani )గృహిణి అని అక్క సుచిత కూడా సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీలోనే ఉందని మానసికంగా నా ఎదుగుదలలో కుటుంబ సభ్యుల పాత్ర కీలకమని సాయికృతి చెప్పుకొచ్చారు.
చదువు విషయంలో ఇంట్లో ఒత్తిడి లేదని పదో తరగతిలో 10 పాయింట్లు వచ్చాయని ఆమె అన్నారు.ఇంటర్ లో 985 మార్కులు సాధించానని ఆమె తెలిపారు.
ఎంసెట్ లో నాకు 186వ ర్యాంక్ సాధించానని సాయికృతి కామెంట్లు చేశారు.సాఫ్త్ వేర్ రంగంపై ఉన్న ఆసక్తితో జే.ఎన్.టీ.యూ కంప్యూటర్ సైన్స్ లో ( JNTU Computer Science )చేరనని సాయికృతి అన్నారు.నాకు కోడింగ్ అంటే ఇష్టమని నాకు ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఇష్టమని ఆమె తెలిపారు.
నాకు బ్యాడ్మింటన్ ఇష్టమని సాయికృతి పేర్కొన్నారు.మూడు రౌండ్లలో ఇంటర్వ్యూ జరిగిందని సాయికృతి అన్నారు.
కాలేజ్ లోనే ఆన్ లైన్ టెస్ట్ పెట్టారని ఫైనల్ రౌండ్ కు ఐదుగురు హాజరైతే నేను మాత్రమే సెలెక్ట్ కావడం సంతోషంగా ఉందని సాయికృతి చెప్పుకొచ్చారు.ఎక్కువ శాతం టెక్స్ట్ బుక్స్ లో చదవడానికే ప్రాధాన్యత ఇచ్చానని ఆమె తెలిపారు.ఇంటర్వ్యూకు వెళ్లేముందు కోర్ సబ్జెక్ట్ లు బాగా చదివానని సాయికృతి పేర్కొన్నారు.ఓపికతో ప్రయత్నిస్తే సక్సెస్ దక్కుతుందని సాయికృతి కామెంట్లు చేశారు.50 లక్షల రూపాయల ప్యాకేజీతో జాబ్ సాధించిన సాయికృతిని నెటిజన్లు ఎంతగానో ప్రశంసిస్తున్నారు.