Luisa Yu : 50 ఏళ్లలో ప్రపంచ దేశాలన్నీ చుట్టేసిన అమెరికన్ మహిళ.. హిస్టరీ క్రియేటెడ్!!

ఒక మహిళ అన్ని దేశాలు తిరగాలనే తన చిరకాల కోరికను తీర్చుకోవడానికి ఏకంగా 50 ఏళ్లు సమయం తీసుకుంది.లూయిసా యు( Luisa Yu) అనే ఈ 79 ఏళ్ల మహిళకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం.

 American Woman Who Traveled All Over The World In 50 Years History Created-TeluguStop.com

ఆమె ఫిలిప్పీన్స్‌లో జన్మించింది, కానీ చిన్నతనంలోనే యూఎస్‌కి మకాం మార్చింది.సెయింట్ లూయిస్‌లో చదువుకుంది.

మయామిలో నివసించింది.యూఎస్‌లోని దాదాపు ప్రతి రాష్ట్రాన్ని ఆమె బస్సుల్లో తిరుగుతూ విజిట్ చేసింది.

యూఎస్ ట్రిప్ కంప్లీట్ చేశాక ఇతర దేశాలను చూడాలని కోరుకుంది, అందుకే ఆమె 1970లో విదేశాలకు వెళ్లడం ప్రారంభించింది.ఆమె మొదటి విదేశీ పర్యటన జపాన్.

అప్పటి నుంచి ఆమె ఐరోపా, ఆసియా, ఆఫ్రికా, మధ్యప్రాచ్యంలోని అనేక ప్రదేశాలను చూసింది.ఆమె ట్రావెల్ ఏజెంట్‌గా, మెడికల్ ప్రొఫెషనల్‌గా పనిచేసింది.

Telugu Explorer Award, Luisa Yu, Serbia, Travel-Telugu NRI

లూయిసా యుకు ఐక్యరాజ్యసమితి( United Nations)లో సభ్యులైన మొత్తం 193 దేశాలను సందర్శించాలనే ఒక పెద్ద కల ఉంది.ఆమె వారి చరిత్ర, సంస్కృతి గురించి ఆసక్తిగా ఉంది.ప్రమాదకరమైన ప్రదేశాలకు వెళ్లేందుకు ఆమె భయపడలేదు.తన కళ్లతో ప్రపంచాన్ని చూడాలనుకుంది.2023లో తన చివరి దేశంగా సెర్బియా( Serbia ) వెళ్లినప్పుడు ఆమె తన కలను సాకారం చేసుకుంది.స్నేహితులు ఆమె అచీవ్‌మెంట్ పట్ల చాలా సంతోషించారు, విమానాశ్రయంలో ఆమెకు పార్టీ ఇచ్చారు.

చాలా మంది ఆమెను అభినందించారు.ఆమె గుడ్ మార్నింగ్ అమెరికాతో మాట్లాడుతూ, ఎవరి కోసం ఎదురుచూడకుండా వెళ్లండి అంటూ ఆమె ప్రయాణీకులకు సలహా ఇచ్చింది.

Telugu Explorer Award, Luisa Yu, Serbia, Travel-Telugu NRI

లూయిసా యు తన ప్రయాణాలకు రెండు అవార్డులను గెలుచుకుంది.ఒకటి ప్రపంచంలోని ప్రతి దేశాన్ని సందర్శించిన వ్యక్తులకు ఇచ్చే నోమాడ్ మానియా అవార్డు( Nomad Mania Award )మరొకటి ఫిలిప్పీన్స్ నుంచి గ్లోబల్ ఎక్స్‌ప్లోరర్ అవార్డు, ఇది అత్యంత సాహసోపేతమైన అన్వేషకులకు ఇస్తారు.లూయిసా యుకు తాను వెళ్లిన అన్ని దేశాలు ఇష్టపడ్డారు, కానీ ఆమెకు ఇటలీ, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్‌ల పట్ల ప్రత్యేక అభిమానం ఉంది.ప్రపంచాన్ని చుట్టి రావాలనుకునే చాలా మందికి ఆమె స్ఫూర్తి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube