తూర్పు గోదావరి జిల్లా( East Godavari district ) నల్లజర్ల మండలంలో పెద్దపులి( Tiger ) సంచారం తీవ్ర కలకలం సృష్టించింది.పోతవరం సమీపంలోని పంట పొలాల్లో పెద్దపులి అడుగు జాడలను, రక్తపు మరకలను స్థానికులు గుర్తించారు.
పంట పొలాలకు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ ను( Fencing ) దాటే సమయంలో పులి గాయపడి ఉంటుందని గ్రామస్తులు భావిస్తున్నారు.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు( Forest Officers ) పెద్దపులి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.మరోవైపు పెద్దపులి సంచారం నేపథ్యంలో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.