వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై( Minister Peddireddy Ramachandra Reddy ) సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం( Satyavedu MLA Adimulam ) మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.పెద్దిరెడ్డిది కుట్ర, మోసమని ఆరోపించారు.
కుట్ర పూరితంగా తనపై నియోజకవర్గ నేతలను ఉసిగొల్పుతున్నారని ఎమ్మెల్యే ఆదిమూలం పేర్కొన్నారు.తనపై దుష్ప్రచారం చేస్తున్న పెద్దిరెడ్డి ఫలితం అనుభవిస్తారని తెలిపారు.
అయితే రానున్న ఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డికి ప్రజలే బుద్ది చెబుతారని పేర్కొన్నారు.తిరుపతి ఎంపీ టికెట్( Tirupati MP Ticket ) ఇస్తామని జగన్( CM Jagan ) చెప్పినా తిరస్కరించానన్నారు.ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానన్న ఆయన దోచుకోవడానికి దాచుకోవడానికి రాలేదని స్పష్టం చేశారు.