ఏపీలో ఎన్నికలు( AP Elections ) రానున్న నేపథ్యంలో టీడీపీ, జనసేన( TDP, Janasena ) సీట్ల సర్దుబాటుపై ప్రత్యేక దృష్టి సారించాయి.ఎన్నికల సన్నాహాల్లో వేగం పెంచిన రెండు పార్టీలు సీట్ల సర్దుబాటుపై ఉమ్మడి ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ మేరకు వచ్చే నెల మొదటివారంలో అభ్యర్థుల జాబితాపై ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.అయితే పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు వ్యవహారంపై ఇప్పటికే చంద్రబాబు,( Chandra Babu ) పవన్ కల్యాణ్( Pawan Kalyan ) రెండు సార్లు కీలక భేటీలు నిర్వహించారు.
ఈ క్రమంలోనే మరోసారి ఇరు పార్టీ పెద్దలు సమావేశం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.ప్రస్తుతం హైదరాబాద్ లో( Hyderabad ) ఉన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ వచ్చే రెండు రోజులు సీట్ల సర్దుబాటుపై ఫోకస్ పెట్టనున్నారని సమాచారం.అలాగే ఉమ్మడి మ్యానిఫెస్టో రూపకల్పనపై కూడా కసరత్తు చేయనున్నారు.అయితే సీట్ల సర్దుబాటు వ్యవహారం నేపథ్యంలోనే చంద్రబాబు రా కదలి రా సభలకు విరామం ప్రకటించారు.