ఏపీలో కాంగ్రెస్( Congress ) ను చేరికలతో బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలను గెలుచుకోవాలి అనే పట్టుదలతో కాంగ్రెస్ ఉంది.ఆ వ్యూహంతోనే తెలంగాణ రాజకీయాల్లో ఉన్న షర్మిలను( Sharmila ) కాంగ్రెస్ లో చేర్చుకుని , ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు.
పార్టీలో చేరికలతో పాటు, అధికార పార్టీ వైసీపీని జగన్ టార్గెట్ చేసుకుని విమర్శలు చేసే విధంగా ఆమెను ప్రోత్సహిస్తున్నారు.ఇక షర్మిల సైతం దూకుడుగానే విమర్శలు చేస్తూ జిల్లాల పర్యటనలు చేస్తూ , పార్టీ కేడర్ లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు .ఇంతవరకు బాగానే ఉన్నా , పార్టీలో చేరికలు అంతంత మాత్రమే అన్నట్టుగా కనిపిస్తున్నాయి.అనేక పార్టీల్లోని కీలక నేతలు , తటస్తులను కలుస్తూ పార్టీలో చేరావాల్సిందిగా షర్మిల ఆహ్వానాలు పంపుతున్నా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు.
ఏపీలో ఏమాత్రం ప్రభావం చూపించని కాంగ్రెస్ లో చేరడం కంటే , రాజకీయంగా రిటైర్మెంట్ తీసుకోవడమే మంచిది అన్న ఆలోచనలో చాలామంది గా కనిపిస్తున్నారు.ఇక పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కనిపించని పరిస్థితి ఆ పార్టీలో నెలకొందట.
కొద్ది రోజులుగా టికెట్లకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తున్నా, స్పందన అంతంత మాత్రమే అన్నట్టుగా ఉందట.
ఇతర పార్టీల్లో చేరేందుకు అవకాశం లేని నేతలు మాత్రమే కాంగ్రెస్ లో ఎక్కువ మంది ఉండడం, వారంతా సీనియర్లు కావడం తో, కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థుల కొరత లేనప్పటికీ మెజారిటీ నియోజకవర్గాల్లో మాత్రం అభ్యర్థుల కోసం జల్లెడ పట్టాల్సిన పరిస్థితి నెలకొంది. టిడిపి, జనసేన, వైసిపి ( TDP, Janasena, YCP )లలో టికెట్ దక్కని కొంతమంది నేతలు మాత్రమే కాంగ్రెస్ వైపు చూసే అవకాశం ఉంది తప్ప , కీలక నాయకులు ఎవరూ కాంగ్రెస్ లో చేరే అవకాశం కనిపించడం లేదు. షర్మిల ఎంతగా ప్రయత్నించినా కాంగ్రెస్ కీలక నేతలు ఎవరూ పార్టీలో చేరేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదు.
ఏపీ, తెలంగాణ విభజన తర్వాత కాంగ్రెస్ ఏపీలో పూర్తిగా చతికలబడింది.
2014 నుంచి జరిగిన ఏ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ప్రభావం చూపించలేకపోయింది.ఇతర పార్టీల్లోకి వెళ్ళలేని నేతలు మాత్రమే కాంగ్రెస్ లో ఉండిపోయారు.ప్రస్తుత రాజకీయ పరిస్థితుల పోటీ దృష్ట్యా , తాము పోటీ చేసినా, విజయ అవకాశాలు అంతంత మాత్రమే అన్నట్లుగా పరిస్థితి ఉంది.దీంతో కాంగ్రెస్ నుంచి పోటీ చేసినా డబ్బులు వృధా అన్న ఆలోచనలో ఆ పార్టీలోని నాయకులే ఉండడం ఆ పార్టీ పరిస్థితిని తెలియజేస్తోంది.175 నియోజకవర్గాల్లోనూ బలమైన నేతలు లేకపోవడం కాంగ్రెస్ కు ఇబ్బందికర పరిణామమే.