Niharika : నిహారిక కామెంట్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన చైతన్య జొన్నలగడ్డ.. అలా చేయడం కరెక్ట్ కాదంటూ?

మెగా డాటర్ నిహారిక ( niharika )పేరు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో మారుమోగుతున్న విషయం తెలిసిందే.అందుకు గల కారణం కూడా లేకపోలేదు.

 Niharika Konidela Opens Up On Her Divorce Exhusband Chaitanya Reacts-TeluguStop.com

విడాకుల తర్వాత మొదటిసారి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక తన విడాకులపై పెళ్లిపై అలాగే తన సినిమాల రీ ఎంట్రీ విషయాలపై ఇలా చాలా అంశాలపై స్పందించింది.చైతన్య తో విడాకుల తర్వాత కొన్నాళ్ళు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న నిహారిక మళ్ళీ ఇటీవల రెగ్యులర్ గా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ, సినిమాలు నిర్మిస్తూ, నటిగా కూడా బిజీ అవుతోంది.

తన కెరీర్ పై ఫోకస్ చేసింది.ఇంటర్వ్యూలో భాగంగా నిహారిక తన పెళ్లి డైవర్స్ విషయాల గురించి మాట్లాడుతూ.

నాది లవ్ మ్యారేజ్ కాదు.అరేంజ్ మ్యారేజ్.

కొన్ని వర్కౌట్ అవ్వక విడి పోవాల్సి వచ్చింది.

Telugu Chaitanya, Divorce, Reacts, Tollywood-Movie

పెళ్లి తర్వాత లైఫ్ బాగా ఉండాలని అంతా అనుకుంటారు.నేను అలాగే అనుకున్నాను.కానీ తర్వాత మనుషులని నమ్మకూడదని అర్థమైంది.ఈ పెళ్లితో నేను ఒక లైఫ్ లెస్సన్ నేర్చుకున్నాను.నా విడాకుల తర్వాత ఎంతో ఏడ్చాను.చాలా బాధగా ఉంటుండే, అందరూ నన్నే కామెంట్స్ చేశారు.సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా చూసి చాలా బాధపడ్డాను.

కానీ ఆ సమయంలో నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ గా నిలబడింది.దాని నుంచి బయటకి రావడానికి చాలా టైం పట్టింది.ప్రస్తుతానికి నేను సింగిల్.లైఫ్‌లో హ్యాపీగా ఉన్నాను అంటూ ఆస‌క్తిక‌ర‌ కామెంట్స్ చేసింది.ఈ వీడియోలో ఆమె చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మాజీ భర్త జొన్నలగడ్డ చైతన్య ( Jonnalagadda Chaitanya )స్పందిస్తూ హాట్ కామెంట్స్ చేశారు.

Telugu Chaitanya, Divorce, Reacts, Tollywood-Movie

ఇంటర్వ్యూ ప్రోమో కింద తనదైన శైలిలో రెస్పాండ్ అయ్యాడు.నిహారికపై వచ్చిన నెగిటివిటి గురించి లేట్‌గా అయిన మాట్లాడి అందరికి తెలియచేసినందుకు నేను అభినందిస్తున్నాను.అలాంటి వ్యక్తిగత కామెంట్స్ ఎదుర్కోవడం చాలా కష్టమని తెలుసు.

కానీ ఇండైరెక్ట్ గా అందులో ఉన్న బాధితుల గురించి ఇలా ప్రమోట్ చేయడం కరెక్ట్ కాదు.ఇది ఇలా జరగడం రెండోసారి.

ఆ బాధ రెండు వైపులా ఒకేలా ఉంటుంది.విడాకుల గురించి మాట్లాడకూడదు, ముఖ్యంగా ఒక వైపే మాట్లాడకూడదు.

అనుభవించిన బాధ కంటే , దాని నుంచి ఎలా బయటపడింది మాట్లాడితే ప్రజలకు ఉపయోగ పడుతుంది.భవిష్యత్తులో ఇలాంటి వాటి గురించి తెలుసుకోవాలి అనుకుంటే, ఆ సంఘటనలతో సంబంధం ఉన్న అందరితో మాట్లాడి ప్రజలకు అవగాహన కల్పించాలి.

కానీ ఏమి తెలియకుండా ప్రజలు ఒక వైపు జడ్జ్‌ చేసి కామెంట్స్ చేయడం పూర్తిగా ఎంత తప్పో, ఇలాంటి ప్లాట్ఫార్మ్స్ ఉపయోగించి ప్రజలకు ఒకవైపు జరిగింది మాత్రమే చెప్పడం కూడా అంతే తప్పు.అర్ధం చేసుకుంటారని అనుకుంటున్నా అంటూ చైతన్య కామెంట్స్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube