మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్( Former Minister Balineni Srinivas ) హాట్ కామెంట్స్ చేశారు.ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుంటే రాజకీయాల నుంచి తప్పుకుందామనుకున్నట్లు తెలిపారు.42 రోజుల పోరాటం తరువాత విజయం సాధించి ఒంగోలు( Ongole )లో అడుగుపెట్టానని బాలినేని పేర్కొన్నారు.అలాగే మాగుంట సీటు వ్యవహారంలో తన ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయోనన్నది తెలియాల్సి ఉందని చెప్పారు.
ఇందుకు మాగుంట కూడా తన వంతు ప్రయత్నాలు చేయాలని పేర్కొన్నారు.
సంతనూతలపాడు నియోజకవర్గంలో తాను చెప్పినవారికి పార్టీ హైకమాండ్ సీటు ఇవ్వలేదని తెలిపారు.కొన్ని ప్రాంతాల్లో నేతల మధ్య అభిప్రాయభేదాలు ఉండొచ్చన్న ఆయన అన్ని నియోజకవర్గాల్లోనూ వైసీపీనే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.