350కి పైగా ఎంపీలతో మళ్లీ మోదీనే ప్రధాని అవుతారు.: కిషన్ రెడ్డి

పార్లమెంట్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో తెలంగాణ బీజేపీ (Telangana BJP) ప్రత్యేక దృష్టి సారించింది.డబుల్ డిజిట్ (Double Digit) స్థానాలే లక్ష్యంగా ముందుకెళ్తున్న కమలం పార్టీలో చేరికల జోష్ కొనసాగుతోంది.

 With More Than 350 Mps Modi Will Become The Prime Minister Again Kishan Reddy De-TeluguStop.com

ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (State Chief Kishan Reddy) ఆధ్వర్యంలో చేవెళ్లకు చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు బీజేపీ కండువా కప్పుకున్నారు.ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఏప్రిల్ మొదటి వారంలో లోక్ సభ ఎన్నికలు (Loksabha Elections) ఉండే అవకాశం ఉందని చెప్పారు.

సుమారు 350కి పైగా ఎంపీలతో మూడోసారి కూడా మోదీనే ప్రధాని (Prime Minister Modi) అవుతారని ధీమా వ్యక్తం చేశారు.మోదీ నాయకత్వంలోనే భారత్ ప్రపంచంలోనే ఐదో ఆర్థిక శక్తిగా ఎదిగిందన్నారు.ఒక కుటుంబం చేతిలో పాలన ఉండటం కారణంగానే తెలంగాణ రాష్ట్రం (Telangana State) అప్పుల పాలయ్యిందని విమర్శించారు.ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రూట్ మ్యాప్ లేకుండా పాలన చేస్తోందని ధ్వజమెత్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube