జయప్రద…( Jayaprada ) తెలుగు సినిమాల ద్వారా ప్రపంచానికి పరిచయం చేయబడి ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా అనేక ఏళ్లపాటు మంచి సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా( Star Heroine ) ఏకచత్రాధిపత్యం చేసిన నటి.జయప్రద చాలామంది హీరోయిన్స్ ల ప్లాస్టిక్ బొమ్మ కాదని, ఆమె కట్టు, బొట్టు, నడవడి, అందం మరే హీరోయిన్ కి లేదని ఆమెలాగా నటించడం కూడా అందరికీ సాధ్యం కాదు అని అప్పటి దర్శక నిర్మాతలు చెబుతూ ఉంటారు.
ఎలాంటి పాత్రనైనా సరే అవలీలగా చేయడం జయప్రద కు ఉన్న బలం.ఆమె సినిమాలో ఉంది అంటే అప్పట్లో థియేటర్ కి క్యూ కట్టేవారు.మరి అలాంటి జయప్రద ఒక చిన్న కారణంతో ఎంతో పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాను వదులుకుంది అని తెలిసి ఆమె అభిమానులు ఇప్పటికీ బాధపడుతూ ఉంటారు.
కొంతమందికి కొన్ని రకాల ఫోబియాలు ఉంటాయి.ఎలాంటివి అంటే నీళ్లలో చూడడానికి కొంతమంది ఇష్టపడరు.అలాగే ఎత్తు పైనుంచి దూకడానికి భయపడుతూ ఉంటారు.
అలాగే కొంతమందికి క్రిమి కీటకాలు అంటే భయం ఉంటుంది.అలాగే నటి జయప్రద కూడా ఒక భయం ఉంది అదేంటంటే ఆమెకు పాములు( Snakes ) అంటే చచ్చేంత భయమట.
అందుకే ఆమె పాములకు చాలా దూరంగా ఉంటారట.పాముల ఫోబియా జయప్రదకు ఎంతలా ఉందంటే 1986 లో బాలీవుడ్ లో నాగిన్( Naagin Movie ) అనే ఒక సినిమా వచ్చింది.
ఈ సినిమాలో శ్రీదేవి( Sridevi ) హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా ఆ ఏడాదికి నిలిచింది.ఈ సినిమా ద్వారా శ్రీదేవి అందుకున్న పేరు ప్రతిష్టలు సామాన్యమైనవి కాదు.అయితే ఇతనికి తొలి చిత్రంలో మొదటగా నటించాల్సింది జయప్రదేనట.కేవలం పాముల పై ఉన్న భయంతోనే ఈ సినిమాలో నటించను అని చెప్పిందట.అలా తనకున్న ఫోబియా తో ఒక బ్లాక్ బస్టర్ విజయాన్ని శ్రీదేవికి మళ్ళించింది జయప్రద.పైగా శ్రీదేవి వర్సెస్ జయప్రద యుద్ధం సినిమా ఇండస్ట్రీలో చాలా ఏళ్లపాటు సాగింది.
అలాంటి టైంలో జయప్రద వద్దనుకున్న సినిమాని శ్రీదేవి చేయడం అప్పట్లో సంచలనాన్ని సృష్టించింది.