రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట్ మండల( Yellareddypet ) కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళ భద్రతే “షీ టీమ్” లక్ష్యం అనే కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డి తో హాజరైన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్( SP Akhil Mahajan ) విద్యార్థిని విద్యార్థులకు ఉమెన్ సేఫ్టీ,మహిళల రక్షణ చట్టాల గురించి ర్యాగింగ్/ ఇవిటీజింగ్/ పోక్సో/ యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ లపై అంశాలపై అవగాహన కల్పిస్తూ, విద్యార్థులని చైతన్య పరచాలనే ఉద్దేశంతో ఈకార్యక్రమం నిర్వహించడం జరిగిందని,మహిళల రక్షణ,భద్రత షీ టీమ్ యెక్క ముఖ్య ఉద్దేశం అన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.
జిల్లాలో మహిళలు, బాలికలపై జరుగుతున్న నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటు చేసిన షీ టీమ్ విద్యా సంస్థలు, బస్టాండ్ లు, మహిళలు పని చేసే ప్రాంతాల్లో, బహిరంగ ప్రదేశాల్లో మఫ్టీలో డ్రెస్ లలో నిరంతరం పోకిరీలపై నిఘా ఉంచుతూ మహిళా చట్టాలపై వివిధ అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, మహిళల రక్షణే ప్రాధాన్యంగా జిల్లా పోలీస్ శాఖాముందుకు సాగుతూ జిల్లాలో ఆపరేషన్ జ్వాల కార్యక్రమం ద్వారా విద్యార్థినిలకు సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమాలు,,అభయ యాప్, బస్ లో భరోసా కార్యక్రమాల ద్వారా మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడం జరుగుతుంది.మైనర్ బాలికల పై ఎవరైనా అఘాయిత్యాలు చేస్తే ఫోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు.
ఎవరైనా వేధించిన, రోడ్డుపై వెళ్లేటప్పుడు,పని చేసే ప్రదేశాల్లో అవహేలనగా మాట్లాడిన ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనే 100, జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 కు పిర్యాదు చేసినచో వారి మీద చట్టపరమైన చర్యాలు తీసుకోవడం జరుగుతుంది అని అన్నారు.సోషల్ మీడియా మాధ్యమాల లో గుర్తు తెలియని వారితో ఎలాంటి చాటింగ్ చేయరాదని, మెసెజు లకు ఎలాంటి స్పందన చేయరాదని,వీలైనంత వరకు సోషల్ మీడియా కు దూరంగా ఉండి చదువు పై దృష్టి పెట్టాలన్నారు.
ఎస్పీ వెంట సి.ఐ శశిధర్ రెడ్డి, ఎస్.ఐ రమాకాంత్, షీ టీం ఏ.ఎస్.ఐ ప్రమీల సిబ్బంది ప్రియాంక, రామదేవి,శ్రీధర్, పాఠశాల సిబ్బంది ఉన్నారు.