టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు రామ్ చరణ్(Ram charan) ఒకరు చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి రామ్ చరణ్ తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా ఈయన పాన్ ఇండియా స్థాయిలో హీరోగా గుర్తింపు పొంది గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ కూడా సొంతం చేసుకున్నారు.ఇలా కెరియర్ పరంగా రామ్ చరణ్ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితంలో కూడా ఈయన ఎంతో సంతోషంగా ఉన్న సంగతి తెలిసిందే.

ఈ విధంగా రాంచరణ్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఈయన ఉపాసన(Upasana) ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.వీరిద్దరూ ప్రేమించుకుని పెద్దల సమక్షంలో గత 11 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు.అయితే వీరి వివాహం జరిగిన 11 సంవత్సరాలకు తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన విషయం తెలిసిందే ఇటీవల ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.
ఈ చిన్నారికి క్లీన్ కారా అని నామకరణం కూడా చేశారు.ఈమె జన్మించి దాదాపు 7 నెలలు పూర్తి అయినప్పటికీ ఇప్పటికీ కూడా ఉపాసన తన పేస్ ఎలా ఉంటుందనే విషయాలను మాత్రం వెల్లడించలేదు.

ఇలా మెగా మనవరాలని చూడటం కోసం అభిమానులందరూ కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఇదిలా ఉండగా తాజాగా క్లీన్ కారా(Klin Kaara) కోసం ప్రత్యేకంగా ఒక పాటను సిద్ధం చేసి సోషల్ మీడియాలో విడుదల చేసిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇలా మెగా బుల్లి వారసురాలి కోసం ఇంత చిన్న వయసులోనే ఒక పాటను ( Song ) రాయడం అంటే ఆమె క్రేజ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అయితే ఈ పాటను సంక్రాంతి పండుగ( Sankranti Festival ) సందర్భంగా ఉపాసన చేతుల మీదుగా విడుదల చేశారు.

క్లీన్ కార కోసం ప్రత్యేకంగా రాసినటువంటి ఈ పాటకు బెల్లంకొండ శ్రీధర్ లిరిక్స్ అందించగా మహావీర్ ఎల్లంధర్ అద్భుతమైనటువంటి ట్యూన్ కంపోజ్ చేశారు.ఇక ఈ పాటను ప్రముఖ సింగర్ ధనుంజయ్( Singer Dhanunjay ) ఆలపించారు.ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక మెగా లిటిల్ ప్రిన్సెస్ ను ఎప్పుడు చూపిస్తారు అంటూ ఈ విషయంపై మరికొందరు కామెంట్లు కూడా చేస్తున్నారు.ఇక సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మెగా కుటుంబ సభ్యులందరూ కూడా బెంగళూరులోని తమ ఫామ్ హౌస్ లో ఈ వేడుకలను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.