అనంతగిరి పర్యాటక అభివృద్ధికి వంద కోట్లు కేటాయించిన కిషన్ రెడ్డి..!!

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి( Kishan Reddy ) వికారాబాద్ జిల్లా అనంతగిరిలో పర్యటించడం జరిగింది.ఈ సందర్భంగా అనంతగిరి పర్యాటక అభివృద్ధికి 100 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ప్రకటన చేశారు.

 Kishan Reddy Has Allocated One Hundred Crores For The Development Of Anantgiri T-TeluguStop.com

త్వరలో అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని కూడా స్పష్టం చేశారు.కేంద్ర ప్రభుత్వ నిధులతో “స్వదేశీ దర్శన్” పేరుతో ఈ కార్యక్రమం చేపడతామని పేర్కొన్నారు.

హైదరాబాదు నగరానికి దగ్గరగా ఉండటంతో చాలామంది ఐటి ఉద్యోగులు అనంతగిరికి వస్తారని పేర్కొన్నారు.అంతేకాకుండా ప్రైవేట్ రంగాల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.
<

ఇందుకోసం ప్రత్యేక విధానాన్ని రూపొందించినట్లు తెలిపారు.సోమవారం వికారాబాద్ జిల్లా కోటిపల్లి సందర్శించిన కిషన్ రెడ్డి( Kishan Reddy ) అక్కడ బోటింగ్ చేయడం జరిగింది.అనంతరం మీడియాతో మాట్లాడుతూ అనంతగిరి పర్యాటకానికి 100 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.ప్రపంచంలో చాలా దేశాలు పర్యాటక రంగంలో ఎంతో అభివృద్ధి సాధిస్తున్నట్లు పేర్కొన్నారు.భారత్ లో కూడా పర్యాటక రంగానికి ఎంతో అనుకూలత ఉంది.దేశంలో పర్యాటక రంగానికి మరింత ఉతమివ్వటానికి ప్రైవేటు పెట్టుబడులు రావాలి.

ఇందుకు బహుళ జాతి కంపెనీలు ముందడుగు వేయాలి అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube