మచిలీపట్నం ఎంపీ బాలశౌరి( Balashowry ) వైసీపీ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది.ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.అనంతరం కొద్దిసేపటికే జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నట్లు పేర్కొన్నారు.“శ్రీ
పవన్ కళ్యాణ్
గారి నాయకత్వంలోని జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాను” అని పోస్ట్ చేశారు.వైసీపీ పార్టీలో ఇన్చార్జిల అభ్యర్థుల మార్పులతో కొంతమంది సిట్టింగ్ ప్రజా ప్రతినిధులు.పోటీ చేసే అవకాశం కోల్పోతున్నారు.ఈ క్రమంలో సిట్టింగ్ ఎంపీ, ఎమ్మెల్యేలను కాదని కొత్త వారికి అవకాశం కల్పిస్తూ ఉండటంతో.పలువురు రాజీనామా చేస్తున్నారు.
ఈ రకంగానే మచిలీపట్నం( Machilipatnam ) ఎంపీగా ఉన్న బాలశౌరి.వైసీపీకి గుడ్ బై చెప్పారు.
వచ్చే ఎన్నికలలో టికెట్ కి సంబంధించి పార్టీ అధిష్టానం నుండి సరైన స్పష్టత రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.స్థానిక వైసీపీ ప్రజా ప్రతినిధులతో కూడా బాలశౌరికి విభేదాలు ఉండటంతో.
పార్టీ మారటమే బెటర్ అని భావించి జనసేన పార్టీలోకి వెళ్లినట్లు నియోజకవర్గంలో టాక్.ఇప్పటికే వైసీపీ నుండి ఎంపీ రఘురామకృష్ణరాజు( Raghu Rama Krishna Raju ) తెలుగుదేశం జనసేన కూటమికి గత కొన్ని సంవత్సరాలు నుండి దగ్గరగా ఉంటున్నారు.
అయితే ఇప్పుడు ఎంపీ బాలశౌరి.జనసేనలోకి వెళ్ళటానికి నిర్ణయం తీసుకోవడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
సంక్రాంతి పండుగ సందర్భంగా.ఆరోజు పవన్ కళ్యాణ్ సమక్షంలో బాలశౌరి.
జనసేన కండువా కప్పుకోబోతున్నట్లు సమాచారం.