విక్టరీ వెంకటేష్ ( Venkatesh ) హీరోగా డైరెక్టర్ శైలేష్ కొలను( Sailesh Kolanu ) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి తాజా చిత్రం సైందవ్ (Saindhav) .ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇక ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా ఈ సినిమా ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇక ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను సందడి చేయడంతో ఈ సినిమా డిజిటల్ రైట్స్ గురించి కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి.
వెంకటేష్ సైందవ్ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్థ అమెజాన్ ప్రైమ్ వారు కొనుగోలు చేశారని తెలుస్తుంది.ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరలకు అమెజాన్ వారు సొంతం చేసుకున్నట్టు సమాచారం.అదేవిధంగా ఈ సినిమా సాటిలైట్ హక్కులను ఈ టీవీ వారు కొనుగోలు చేశారంటూ వార్తలు వస్తున్నాయి.
ఇక ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో మంచి ఆదరణ సొంతం చేసుకుని దూసుకుపోతుంది.ఈ క్రమంలోనే థియేటర్లో నెలరోజులు పూర్తి అయిన తర్వాతనే ఈ సినిమాని తిరిగి అమెజాన్ ప్రైమ్ వీడియో ( Amazon prime ) లో ప్రసారం చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమా జనవరి 13వ తేదీ విడుదలైంది కనుక ఫిబ్రవరి రెండవ వారంలో డిజిటల్ మీడియాలో ప్రసారమయ్యే అవకాశాలు ఉన్నాయి.అయితే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి సంబంధించినటువంటి విషయాలను త్వరలోనే అమెజాన్ వారు అధికారకంగా తెలియచేయునున్నట్లు తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో వెంకటేష్ సరసన శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమా థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.