గుంటూరు కారం సినిమా( Guntur Karam Movie ) బాలేదు అని చాలా మంది అభిమానులు చెప్తున్నారు.అయితే ఒక ప్రేక్షకుడిగా సగటు అభిమానిగా సినిమాని గా మాత్రమే, సినిమాను మాత్రమే ప్రేమించే వ్యక్తిగా ఈ ఆర్టికల్ లో రాసే ప్రతి మాట మీరు గుర్తు పెట్టుకోవాలి.
మీరు చదివే ప్రతి అక్షరం సినిమా కోసమే అని మీరు గుర్తుంచుకోవాలి.సినిమా ఎలా అయినా ఉండొచ్చు కానీ ఒక సినిమా( Movie ) పరాజయం పాలయింది అంటే అందులో మన తప్పు ఏమాత్రం లేదా ? సినిమాను మించి ప్రస్తుతం కొన్ని అతీత శక్తులు రాజ్యమేలుతున్నాయి అనే విషయాన్ని మీరు గుర్తించడం లేదా ? ఖచ్చితంగా సినిమాలను ప్రేక్షకుడు శాసించే రోజులు వచ్చాయి.బయట వ్యక్తులు లేదా బయట పరిస్థితులు అలా తీసుకువచ్చాయి.

ఇందులో మొదటగా మాట్లాడుకోవాల్సింది టెక్నాలజీ( Technology ) ఒక సినిమా ఫెయిల్ అవుతుంది అంటే అందులో టెక్నాలజీ తప్పు చాలా ఎక్కువ శాతం ఉంటుంది.మన మాటలో చెప్పాలంటే ఇంతకు ముందు మనం సినిమా మన భాషలో విడుదలయితే మాత్రమే చూసే వాళ్ళం.వేరే భాష చిత్రాలు చూసేందుకు మొదట్లో మనకు అవకాశాలు ఉండేవి కాదు.
కానీ ఇప్పుడు అరచేతిలో స్వర్గం కనిపిస్తుంది.ఎలాంటి భాష సినిమా అయినా మన చేతిలో ఉన్న ఫోన్లో చూసేయొచ్చు.
మొబైల్ ఫోన్ ప్రపంచ సినిమాను చాలా ఈజీగా ప్రతి ఒక్కరికి దగ్గర చేసింది.అప్పట్లో అలాగే ఉండేది.
ట్రెండ్( Trend ) మారడానికి దాదాపు పదేళ్ళ పట్టేది.

మరి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే ట్రెండ్ మారడానికి ఒకరోజు ఒక నెల అనే తేడా లేదు.ప్రతి రోజు ట్రెండు మారిపోతోంది టెక్నాలజీ మారిపోతోంది.ఆ ట్రెండుకు అనుగుణంగా సినిమాలు తీయలేక చాలా మంది దర్శకులు( Directors ) చతికల పడిపోతున్నారు.
ప్రేక్షకులు అభిరుచి( Audience Taste ) రోజు రోజుకు మారిపోతూ ఉంటే సినిమా తీసే దర్శకులకు పట్టు దొరకడం లేదు.ఈ తరం ప్రేక్షకుల యొక్క టేస్ట్ మారిపోవడంతో చాలామంది దర్శకులు ఖాళీగానే ఉన్నారు.
భీమినేని శ్రీనివాసరావు,( Bhimineni Srinivasarao ) బి.గోపాల్,( B Gopal ) శివ నాగేశ్వరరావు, ముత్యాల సుబ్బయ్య, కే రాఘవేంద్రరావు, ముప్పలనేని శివ వీరంతా కూడా ప్రస్తుతం సినిమాలు తీయలేక రిటైర్మెంట్ ప్రకటించారు.

ప్రస్తుతం వేగంగా వ్యాప్తి చెందిన టెక్నాలజీకి అలవాటు పడలేక, ట్రెండ్ అనే చట్రం లో ఇవ్వడం లేక ఈ దర్శకులంతా సినిమాలను మానేశారు.అయితే ఇలాంటి ట్రెండుకు పరిస్థితులకు పూర్తి విభిన్నం త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) అనే పరిస్థితిలో ప్రేక్షకులు ఉన్నారు.ఎందుకంటే ఆయన సాహిత్యం తెలిసిన వ్యక్తి.సాహిత్యంలో కొన్ని వందల కథలు ఉంటాయి.అందుకే అద్భుతమైన సినిమా తీస్తారు కానీ అనుకుంటే త్రివిక్రమ్ కూడా అదే మూసలోకి వెళ్లిపోయాడు అని గుంటూరు కారం చూసిన తర్వాతే అర్థమైంది.కొన్నేళ్లు వెనక్కి వెళితే ఆయన తీసిన ఫ్లాప్ సినిమాలకు కూడా మంచి గుర్తింపు గౌరవం దక్కేది.
ఆయన అంటేనే ఒక కల్ట్ అనే భావన ఉండేది.ఇప్పుడు అది తప్పు అని అనుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి.