2024 ఎన్నికలను వైసీపీ( YCP ) చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం తెలిసిందే.ఈ క్రమంలో ప్రజా వ్యతిరేకత కలిగిన నాయకులను పక్కన పెట్టేస్తూ రెండు జాబితాలను విడుదల చేయడం జరిగింది.
మొదటి జాబితాలో 11 మంది రెండో జాబితాలో 27 మందిని.ఇన్చార్జిల మార్పులు చేర్పులు చేస్తూ జాబితాలు విడుదల చేయడం జరిగింది.
ఇదిలా ఉంటే నేడు వైసీపీ ఇన్చార్జిలా మూడో జాబితా విడుదల చేయటం జరిగింది.ఈ జాబితాలో 6 లోక్ సభ, ఇన్చార్జిలతో పాటు 15 అసెంబ్లీ ఇన్చార్జిలకి సంబంధించి మొత్తం 21 మంచి అభ్యర్థులను ప్రకటించారు.
వచ్చే ఎన్నికలలో వీళ్ళు ఎంపీలుగా మరియు ఎమ్మెల్యేలుగా పోటీ చేయబోతున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ( Minister Botsa Satyanarayana ) మరియు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంపెట్టి తెలియజేయడం జరిగింది.
ఈ లిస్టులో… విజయవాడ ఎంపీగా కేశినేని నాని, కర్నూలు ఎంపీగా గుమ్మనూరి జయరాం, తిరుపతి ఎంపీగా కోనేటి ఆదిమూలం, విశాఖపట్నం ఎంపీగా బొత్స ఝాన్సీ లక్ష్మి, ఏలూరు ఎంపీగా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, శ్రీకాకుళం ఎంపీగా పేరాడ తిలక్ పేర్లు ఖరారు చేయడం జరిగింది.
అసెంబ్లీ నియోజకవర్గాలకు వచ్చేసరికి ఇచ్చాపురం నుండి పిరియా విజయ, టెక్కలి నుండి దువ్వాడ శ్రీనివాస్, చింతలపూడి (ఎస్సీ) నుండి కంభం విజయ రాజు, రాయదుర్గం నుండి మెట్టు గోవిందరెడ్డి, దర్శి నుండి బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి, పూతలపట్టు (ఎస్సీ) నుండి మూతిరేవుల సునీల్ కుమార్, చిత్తూరు నుండి విజయానంద రెడ్డి, మదనపల్లె నుండి నిస్సార్ అహ్మద్, రాజంపేట నుండి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఆలూరు నుండి బూసినే విరూపాక్షి, కోడుమూరు (ఎస్సీ) డాక్టర్ సతీష్, గూడూరు (ఎస్సీ) మేరీగ మురళి, సత్యవేడు (ఎస్సీ) మధిల గురుమూర్తి, పెనమలూరు నుండి జోగి రమేష్, పెడన నుండి ఉప్పల రాము.పేర్లను మూడో జాబితాలో విడుదల చేయడం జరిగింది.