ఏపీలో బీజేపీ ముఖ్యనేతల భేటీ ముగిసింది.ఈ మేరకు పొత్తులపై బీజేపీ జాతీయ నేత శివప్రకాశ్ నాయకుల అభిప్రాయాలను తీసుకున్నారు.
టీడీపీతో పొత్తు అంశాన్ని అధిష్టానం నిర్ణయానికే వదిలేయాలని నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే పొత్తులు లేకుండా పోటీ చేయగలమా అనే అంశంపైనా శివప్రకాశ్ నాయకుల నుంచి అభిప్రాయాలను సేకరించారు.
పొత్తులు లేకుండా పోటీ చేస్తే ఓట్లు పెరుగుతాయి కానీ సీట్లు రావని పలువురు నాయకులు చెప్పారని తెలుస్తోంది.జనసేనతో పొత్తు కొనసాగుతుందనే అంశాన్ని స్పష్టంగా చెప్పాలని నేతలు కోరారు.
ఈ నేపథ్యంలో ఈ నెలాఖరులోపు ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇవ్వాలని బీజేపీ నేతలు కోరారు.అదేవిధంగా రాష్ట్రంలో బీజేపీ పోటీ చేసే స్థానాలపైనా నేతలు సమావేశంలో ప్రధానంగా చర్చించారు.