Nivetha Thomas: క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో నివేథా థామస్… గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నటి?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి హీరోయిన్గా అందరిని మెప్పించినటువంటి వారిలో నటి నివేథా థామస్(Nivetha Thomas) ఒకరు.ఈవెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటు తమిళ చిత్రాలలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు.

 Nivetha Thomas Dance Video Viral On Social Media-TeluguStop.com

అయితే ఈ మధ్యకాలంలో ఈమెకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయని తెలుస్తుంది.ఇలా ఈమెకు సినిమా అవకాశాలు లేకపోవడంతో సినిమా ఇండస్ట్రీకి కూడా దూరంగా ఉన్నారు.

ఇక చివరిగా ఈమె నటి రెజీనాతో కలిసి ఓ సినిమాలో నటించారు.

ఈ సినిమా తర్వాత నివేథా పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు.

అయితే ఈమెకు అవకాశాలు రాకపోవడంతో సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారని తెలుస్తుంది.ఇకపోతే ఇటీవల క్రిస్మస్ పండుగను( Christmas ) పురస్కరించుకుని తన ఫ్రెండ్స్ తో కలిసి ఈమె పెద్ద ఎత్తున పార్టీ చేసుకున్నారు.

అందుకు సంబంధించినటువంటి వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఇక ఈ వీడియోలో భాగంగా తన స్నేహితుడు పెప్సీ తలపై పెట్టుకుని అందరూ కలిసి జమాల్ కుడికి పాటకు డాన్స్ చేశారు.

ఇలా ఈ పాటకు డాన్స్( Nivetha Thomas Dance ) వేయడంతో ఇందుకు సంబంధించినటువంటి వీడియోని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో అందరూ కూడా ఈమె గురించి పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.అసలు ఇక్కడ ఉన్నది హీరోయిన్ నివేథానేనా అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఈమె అధిక శరీర బరువు పెరిగిపోవడంతో గుర్తుపట్టలేనంతగా మారిపోయారు.ఇలా ఉన్నఫలంగా ఈమె భారీ శరీర బరువు పెరగడంతో అభిమానులు షాక్ అవుతారు.

ఈ విధంగా ఈమె శరీర బరువు పెరగడంతోనే బహుశా తనకు సినిమా అవకాశాలు( Movie Offers ) రాలేదేమో అంటూ కూడా కొందరు కామెంట్లు చేస్తున్నారు.ఈమె పూర్తిగా షేప్ అవుట్ కావడంతో హీరోయిన్ మెటీరియల్ కాదని హీరోయిన్ లో ఉండాల్సిన లక్షణాలు ఈమెలో లేకపోవడం వల్ల ఏ దర్శకులు కూడా ఈమెకు సినిమాలలో అవకాశం కల్పించలేదని తెలుస్తోంది.ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది అభిమానులు ఈ వీడియో పై స్పందిస్తూ అసలు నివేథా వైపు తప్ప మా చూపు పక్కకు వెళ్లలేదు అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు మాత్రం అసలేంటి ఇలా గుర్తుపట్ట లేకుండా మారిపోయారు.కాస్త శరీర బరువు తగ్గండి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈమె సాధారణంగానే శరీర బరువు పెరిగారా లేకపోతే ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా అన్న సందేహాలు కూడా అందరిలోనూ కలుగుతున్నాయి.ఏది ఏమైనా ఒకప్పుడు ఎంతో సన్నగా అందంగా ఉన్నటువంటి ఈమె ఇలా అధిక శరీర బరువు పెరిగిపోవడంతో అభిమానులు షాక్ అవుతున్నారు.ఈమె బరువు పెరిగినందుకే తనకు ఇండస్ట్రీలో కూడా ఆ అవకాశాలు రాలేదని అందుకే ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube