ప్రశాంత్ నీల్( Prashanth neel ).ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో మారుమోగుతున్న పేరు.
ప్రశాంత్ నీల్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా సలార్.కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే.
ఇందులో పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నటించారు.శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.
కాగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ అందుకోవడంతో పాటు ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది.దీంతో దర్శకుడు ప్రశాంత్ పేరు మారు మోగిపోతోంది.
ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ప్రశాంత్ నీల్ గురించి అతని సక్సెస్ సీక్రెట్ ల గురించి ఒక వార్త చెక్కర్లు కొడుతోంది.ఆ సీక్రెట్ ఏంటి అన్న విషయానికి వస్తే.
ఎవరైనా సరే పిచ్చితో సినిమాల్లోకి వస్తారు.ప్రశాంత్ నీల్ మాత్రం అనుకోకుండా, అది కూడా డబ్బులు సంపాదిద్దామని డైరెక్షన్ కోర్స్ చేశాడు.
ఇందులో డెప్త్ అర‍్థమయ్యేసరికి కొడితే కుంభస్థలం కొట్టాలని ఫిక్సయ్యాడు.డైరెక్టర్ అయిపోయాడు.
ఏ ఇండస్ట్రీలోనైనా కొత్తోళ్లకు ఛాన్సులంటే చాలా కష్టం.దీంతో మాస్టర్ స్కెచ్ వేసి అప్పటికే కన్నడలో హీరోగా ఒక మాదిరి గుర్తింపు తెచ్చుకున్న తన బావ శ్రీమురళికి ఓ కథ వినిపించాడు.
అనుభవం లేకపోవడం, స్క్రిప్ట్ పెద్దగా నచ్చకపోయేసరికి శ్రీమురళి దీన్ని లైట్ తీసుకున్నాడు.దీంతో ప్రశాంత్ నీల్ మనసు మారింది.
శ్రీమురళిని దగ్గరుండి బాగా అబ్జర్వ్ చేస్తూ ఉగ్రం అనే మాస్ స్క్రిప్ట్ రెడీ చేశాడు.ఇది శ్రీమురళికి నచ్చేయడంతో సినిమా మొదలైంది.
కట్ చేస్తే థియేటర్లలో రిలీజైన ఈ మూవీ 2014లో కన్నడలో సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ప్రశాంత్ నీల్ అంటే ఎవరబ్బా? అని అందరూ మాట్లాడుకునేలా చేసింది.దీనిదెబ్బకు మనోడికి చాలా ఛాన్సులు వచ్చినా సరే యశ్ కోసం కేజీఎఫ్ స్క్రిప్ట్ రెడీ చేశాడు.కోలార్ గోల్డ్ గనుల గురించి అందరూ విన్నారు.
కానీ ప్రశాంత్ నీల్ మాత్రం దానిపై ఓ సినిమా తీయాలనుకున్నాడు.కేజీఎఫ్ సినిమాతో తన గురించి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేలా చేశాడు ప్రశాంతి నీల్.
అలా కేజిఎఫ్ పార్ట్ వన్ పార్ట్ 2లతో బాగా గుర్తింపు సంపాదించుకున్నారు.ప్రశాంత్ నీల్ సినిమాలు ఎలా తీస్తాడబ్బా అని చాలామందికి డౌట్.
అయితే మందు తాగిన తర్వాతే ఈ స్టోరీలన్నీ రాస్తుంటానని గతంలో ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు.స్టోరీ రాయడానికి మందు ఎలా ఇంపార్టెంటో.
కథ ఏదైనా సరే బొగ్గు కూడా అంతే ఇంపార్టెంట్.
ఉగ్రం మూవీలో( Ugramm ) జస్ట్ శాంపిల్‌గా ఉంటే.కేజీఎఫ్, సలార్ ( Salaar )మొత్తం బొగ్గే కనిపిస్తుంది.అయితే తనకున్న ఓసీడీ సమస్య వల్లే ఇలా అంతా బ్లాక్ ఉంటుందని చెప్పాడు.
అయితే కలర్‌ఫుల్‌గా ఉంటేనే సినిమా చూస్తారు అనే దాన్ని కూడా ప్రశాంత్ నీల్ బొగ్గుపై తనకున్న ఇష్టంతో బ్రేక్ చేసి పడేశాడు.అలానే హీరోని చూపించాల్సిన పనిలేకుండా హీరో పిడికిలి, నీడ లాంటి వాటితోనూ ఎలివేషన్స్ ఇవ్వొచ్చనే ఆలోచన ప్రశాంత్ నీల్‌కి సాధ్యమైందని చెప్పవచ్చు.
ప్రస్తుతం నార్త్-సౌత్ సినిమాల్లో తెలుగోళ్ల హవా కనిపిస్తుంది.అలానే ప్రశాంత్ నీల్ మూలాలు కూడా తెలుగు నేలపైనే ఉన్నాయి.ఉమ్మడి అనంతపురంలో మడకశిర మండలంలోని నీలకంఠాపురం ఇతడి సొంతూరు.కానీ ప్రశాంత్ నీల్ పుట్టకముందే అతడి తల్లిదండ్రులు బెంగళూరులో సెటిలైపోయారు.
అలా కన్నడ వ్యక్తి అయ్యాడు.కానీ దాదాపు 25 ఏళ్ల నుంచి తెలుగు సినిమాలు చూస్తూ పెరిగాడు.
ఆ ప్రభావమో ఏమో గానీ మనోడి సినిమాల్లో మాస్, ఎలివేషన్స్ అన్నీ కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చేస్తున్నాయి.తాజాగా విడుదల అయిన ప్రభాస్ సలార్ కూడా అలాంటి మూవీనే.
ఇక ప్రశాంత్ నెక్స్ట్ మూడు సినిమాలు.ఎన్టీఆర్, ప్రభాస్, యశ్‌తోనే.
ఏదేమైనా సరే ఇలా ప్రశాంత్ నీల్ మరిన్ని మాస్ సినిమాలు తీస్తూ ఇండియాలో థియేటర్లన్నీ ఊగిపోయేలా చేయాలని అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు.