నాగార్జున 'శివ' సినిమాని మిస్ చేసుకున్న క్రేజీ స్టార్ హీరో అతనేనా..? చేసి ఉంటే వేరే లెవెల్ ఉండేది!

తెలుగు సినిమాని కమర్షియల్ పరంగా, టెక్నికల్ పరంగా మరియు టేకింగ్ పరంగా వేరే లెవెల్ కి తీసుకెళ్లిన చిత్రం అక్కినేని నాగార్జున హీరో గా నటించిన ‘శివ( Nagarjuna )’.రామ్ గోపాల్ వర్మ మొదటి సినిమా ఇది.

 Is He The Crazy Star Hero Who Missed Nagarjuna's 'shiva' Movie? It Would Have B-TeluguStop.com

ఈ ఒక్క చిత్రం తో ఆయన వంద సినిమాలు దర్శకత్వం వహించిన డైరెక్టర్ సంపాదించే క్రేజ్ ని సంపాదించాడు.ఈ సినిమాలో అనేక సన్నివేశాలకు రామ్ గోపాల్ వర్మ వాడిన కెమెరా యాంగిల్స్ మరియు షాట్స్ మేకింగ్ హాలీవుడ్ చిత్రాలలో కూడా ఏ డైరెక్టర్ తియ్యలేకపోయాడు అనే చెప్పొచ్చు.

ఆ స్థాయి డైరెక్టర్ గా తనని తానూ నిరూపించుకున్నాడు.ఈ చిత్రం తర్వాత ఆయనకీ బాలీవుడ్ లో అవకాశాలు వచ్చాయి.అక్కడ కూడా ఎన్నో అద్భుతమైన చిత్రాలను తీసి ప్రభంజనం సృష్టించాడు.ఇప్పుడు సందీప్ వంగ ఎలా అయితే సెన్సేషన్ ని క్రియేట్ చేసాడో, అప్పట్లో రామ్ గోపాల్ వర్మ అలా అన్నమాట.

Telugu Amala, Ram Gopal Varma, Ramanaidu, Shiva, Tollywood, Venkatesh-Movie

శివ చిత్రం కేవలం టెక్నికల్ గా మాత్రమే కాదు, టేకింగ్ పరంగా కూడా వేరే లెవెల్ అనిపించుకుంది.ఆరోజుల్లోనే ఈ చిత్రం దాదాపుగా 5 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది.అతి తక్కువ ప్రింట్స్ తో విడుదల అయ్యినప్పటికీ కూడా, ఈ సినిమా దాదాపుగా అన్నీ సెంటర్స్ లో గతం లో ఉన్న రికార్డ్స్ ని బద్దలు కొట్టి ఆల్ టైం రికార్డ్స్ ని నెలకొల్పింది.అయితే రామ్ గోపాల్ వర్మ అప్పటికే కొత్త డైరెక్టర్ కాబట్టి ఇతనితో సినిమా తియ్యడానికి ఎవ్వరూ ధైర్యం చేయలేదట.

ముందుగా ఆయన ఈ కథని నాగార్జున కి వినిపించలేదు.అసలు ఈ కథకి ఆయన సరిపోతాడని కూడా అనుకోలేదట.ఎందుకంటే అప్పటి వరకు నాగార్జున రొమాంటిక్ లవ్ స్టోరీస్ చేసి లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్నాడు.అలాంటి హీరోతో ఇంత మాస్ రోల్ అంటే బాగుండదేమో అనే ఫీలింగ్ ఉండేదట.

Telugu Amala, Ram Gopal Varma, Ramanaidu, Shiva, Tollywood, Venkatesh-Movie

అందుకే ఈ కథని విక్టరీ వెంకటేష్ ( Venkatesh )తో తియ్యాలని రామానాయుడు కి స్టోరీ ని వినిపించేందుకు గంటకి పైగా ఎదురు చూస్తూ ఉన్నాడు.రామానాయుడు కి స్టోరీ ని వినిపించాడు.ఆయన కూడా వెంకటేష్ ఇప్పుడు కుటుంబ కథా చిత్రాలు చేస్తున్నాడు కదా, ఇలాంటి కొత్త రకమైన టేకింగ్ తో తీసే సినిమాలు ఆడియన్స్ కి నచ్చుతుందో లేదో, వేరే హీరోకి ట్రై చేసుకో, నాగార్జున ఈ కథకి సరిపోతాడు అని ఆయనే రికమెండ్ చేసాడట. రామానాయుడు స్థాయి వ్యక్తి చెప్పిన తర్వాత కలిసి స్టోరీ వినిపించకపోతే బాగుండదు, అయినా ఇప్పుడు మనం కోరుకున్న హీరో దొరకడానికి మనం ఏమి తోపు డైరెక్టర్ కాదు కదా, ఇది నా మొదటి సినిమా అనుకోని నాగార్జున కి వెళ్లి కథని వినిపించాడట.

సింగల్ సిట్టింగ్ లోనే స్టోరీ ఓకే అయిపోయింది.ఆ తర్వాత జరిగిన హిస్టరీ మన అందరికీ తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube