జూనియర్ ఎన్టీఆర్ - బాలకృష్ణ కాంబినేషన్ లో ఆగిపోయిన తమిళ రీమేక్ సినిమా అదేనా?

మన టాలీవుడ్ లో చాలా మంది అభిమానుల మనస్సులో మల్టీస్టార్ర్ర్ సినిమాలు తమ అభిమాన హీరోలు చేస్తే బాగుంటుంది అని ఉంటుంది.ఎన్టీఆర్ కాలం లో మల్టీస్టార్ర్ర్ చిత్రాలు సర్వసాధారణం కానీ, ఈ జనరేషన్ లో అలాంటివి కష్టం.

 Junior Ntr-balakrishna Combination Tamil Remake Movie That Stopped , Janatha Gar-TeluguStop.com

అయితే ఎప్పుడైతే రాజమౌళి ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో #RRR చిత్రం చేసాడో, అప్పటి నుండి క్రేజీ మల్టీస్టార్ర్ర్ చిత్రాలకు ఇక్కడ డిమాండ్ బాగా పెరిగింది.నిర్మాతలు కూడా మల్టీస్టార్ర్ర్ చిత్రాలను నిర్మించడానికి ధైర్యం చేస్తున్నారు.

అలా టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉన్న మల్టీస్టార్ర్ర్ లిస్ట్ తీస్తే బాలకృష్ణ మరియు జూనియర్ కాంబినేషన్ కచ్చితంగా లిస్ట్ లో ఉంటుంది.వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒక్క సినిమా పడితే చూడాలని నందమూరి అభిమానుల కోరిక.

రెండు మూడు సార్లు ప్రయత్నం చేసారు కానీ ఎందుకో వర్క్ అవుట్ అవ్వలేదు.

Telugu Balakrishna, Janatha Garage, Jilla, Ntr, Kollywood, Mohanlal, Tollywood-M

ఉదాహరణకి ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్( Janatha Garage )’ చిత్రం లో మోహన్ లాల్ పాత్ర ని తొలుత బాలయ్య బాబు తో చేయించాలని అనుకున్నాడట కొరటాల శివ.కానీ ఎందుకో అది కార్యరూపం దాల్చలేదు.ఆ తర్వాత తమిళం లో విజయ్ మరియు మోహన్ లాల్( Jilla ) కాంబినేషన్ లో ‘జిల్లా’ అనే చిత్రం విడుదలై పెద్ద హిట్ అయ్యింది.

ఈ సినిమా ఆ చిత్ర దర్శకుడు తెలుగు లో బాలయ్య మరియు ఎన్టీఆర్ కాంబినేషన్లో చెయ్యాలి అని అనుకున్నాడట.బాలయ్య బాబు చెయ్యడానికి సిద్దంగానే ఉన్నప్పటికీ, జూనియర్ ఎన్టీఆర్ రీమేక్ చిత్రం కదా, పైగా పెద్ద స్టోరీ కాదని పక్కన పెట్టేసాడట.

అలా ఈ క్రేజీ కాంబినేషన్ మిస్ అయ్యింది.మళ్ళీ ఈ కాంబినేషన్ లో సినిమా చెయ్యడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు.ఇప్పుడు టాలీవుడ్ లో మల్టీస్టార్ర్ర్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి భవిష్యత్తులో అయినా తెరకెక్కుతుందేమో అనే ఆశతో ఉన్నారు నందమూరి ఫ్యాన్స్.

Telugu Balakrishna, Janatha Garage, Jilla, Ntr, Kollywood, Mohanlal, Tollywood-M

అయితే ఈ కాంబినేషన్ భవిష్యత్తులో కూడా అసాధ్యం అనే చెప్పాలి.ఎందుకంటే ఎన్టీఆర్ మరియు బాలకృష్ణ( JR NTR ) మధ్య చాలా గ్యాప్ ఏర్పడింది.ఇద్దరి మధ్య మాటలు లేవు అనే విషయం రీసెంట్ గా జరిగిన కొన్ని సంఘటనలను చూస్తే అర్థం అవుతుంది.

ఒక సందర్భంలో బాలకృష్ణ ఎన్టీఆర్ గురించి ఒక ప్రశ్న అడగగా, అతనితో నాకు సంబంధం లేదు, అతను ఏమి చేసుకున్న ఐ డోంట్ కేర్ అంటూ సంచలన కామెంట్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.వీళ్లిద్దరు కలిసి సినిమా చేసే విషయం కాసేపు పక్కన పెడితే, కలిసి ఫోటో దిగితే చాలు అనే పరిస్థితి వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube