అండర్-19 ప్రపంచ కప్ షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ.. భారత జట్టు మ్యాచులు ఎప్పుడంటే..?

అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్( Under-19 World Cup ) షెడ్యూల్ ను ఐసీసీ ( ICC ) ప్రకటించింది.ఈ ప్రపంచకప్ టోర్నీ దక్షిణాఫ్రికా వేదికగా జనవరి 19 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరగనుంది.

 2024 Icc U19 Mens Cricket World Cup Schedule In South Africa Details, 2024 Icc U-TeluguStop.com

ఈ ప్రపంచ కప్ టోర్నీకు ఆతిథ్యం ఇచ్చే హక్కును ముందుగా శ్రీలంక దక్కించుకుంది.కానీ నవంబర్ లో శ్రీలంక క్రికెట్ బోర్డును ఐసీసీ సస్పెండ్ చేయడంతో.

దక్షిణాఫ్రికా ఈ టోర్నీ ఆతిథ్య హక్కులను దక్కించుకుంది.దక్షిణాఫ్రికా లోని( South Africa ) ఐదు స్టేడియాలలో మొత్తం 41 మ్యాచ్లు జరగనున్నాయి.

ఈ టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొననున్నాయి.ఈ జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు.

గ్రూప్-ఏ: భారత్, బంగ్లాదేశ్, యూఎస్ఏ, ఐర్లాండ్.
గ్రూప్-బి: ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, స్కాట్లాండ్.
గ్రూప్-సి: ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే, నమీబియా.
గ్రూప్-డి: ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, న్యూజిలాండ్, నేపాల్.

Telugu Icc Cricket Cup, Africa, Cricket Cup, Cricketcup, India, Cup Schedule-Spo

దక్షిణాఫ్రికాలో మ్యాచ్లు జరిగే ఐదు స్టేడియాలు: విల్లోమూర్ పార్క్ స్టేడియం, జెబి మార్క్స్ ఓవల్ స్టేడియం, కింబర్లీ ఓవల్ స్టేడియం, బఫెలో పార్క్ స్టేడియం, మాంగాంగ్ ఓవల్ స్టేడియం.అండర్-19 ప్రపంచకప్ కు ఆతిథ్యం ఇచ్చే దక్షిణాఫ్రికా వర్సెస్ వెస్టిండీస్( South Africa vs West Indies ) మధ్య జరిగే మ్యాచ్ తో ఈ టోర్నీ ప్రారంభం ఉంది.అండర్-19 ప్రపంచ కప్ లీగ్ దశలో భారత జట్టు ఆడే షెడ్యూల్ ఇదే:

Telugu Icc Cricket Cup, Africa, Cricket Cup, Cricketcup, India, Cup Schedule-Spo

జనవరి 20వ తేదీ భారత్ వర్సెస్ బంగ్లాదేశ్,( India vs Bangladesh ) జనవరి 22వ తేదీ భారత్ వర్సెస్ ఐర్లాండ్, జనవరి 28వ తేదీ భారత్ వర్సెస్ యూఎస్ఏ మధ్య మ్యాచులు జరగనున్నాయి.ఈ నాలుగు గ్రూపులలో.ఒక్కో గ్రూపులో మొదటి రెండు స్థానాలలో నిలిచిన జట్లు తదుపరి దశకు చేరుకుంటాయి.ఇటీవలే జరిగిన వన్డే వరల్డ్ కప్ లో భారత జట్టు తృటిలో టైటిల్ చేజార్చుకుంది.

ఈ అండర్-19 ప్రపంచ కప్ గెలవాలని భారత్ గట్టి పట్టుదలతో ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube