వైసీపీ( YCP ) అధిష్టానం సోమవారం దాదాపు 11 నియోజకవర్గాలలో వైసీపీ ఇంఛార్జ్ లు మార్చి కొత్తవారిని నియమించడం జరిగింది.ప్రత్తిపాడు నియోజకవర్గానికి బాలసాని కిరణ్, కొండేపి నియోజకవర్గానికి ఆదిమూలకు సురేష్, వేమూరు నియోజకవర్గానికి వరికూటి అశోక్ బాబు, తాడికొండ నియోజకవర్గనికి సుచరిత, సంతనూతలపాడు నియోజకవర్గానికి మెరుగు నాగార్జున, చిలకలూరిపేట నియోజకవర్గానికి మల్లెల రాజేష్ నాయుడు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం విడదల రజినీ, అద్దంకి నియోజకవర్గానికి హనిమిరెడ్డి, రేపల్లె నియోజకవర్గనికి ఈవూరు గణేష్, మంగళగిరి నియోజకవర్గానికి గంజి చిరంజీవి( Ganji Chiranjeevi ), గాజువాక నియోజకవర్గనికి రామచందర్ రావులను నియమించడం జరిగింది.
ఈ క్రమంలో నియోజకవర్గాల ఇంచార్జ్ ల మార్పులపై సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala Ramakrishna Reddy )కీలక వ్యాఖ్యలు చేశారు.పార్టీ బలోపేతం గెలుపు కోసమే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
రాబోయే రోజుల్లో ఇంకా మార్పులు ఉండొచ్చు…ఉండకపోవచ్చు అని అన్నారు.ఎన్ని స్థానాలలో మార్పులు ఉంటాయనేది.
ఇప్పుడే చెప్పలేం.అవసరాన్ని బట్టి మార్పులు ఉంటాయి.
అందరికీ నచ్చచెప్పుతూ మార్పులు చేస్తున్నట్లు.సజ్జల రామకృష్ణారెడ్డి తెలియజేయడం జరిగింది.
ఇదిలా ఉంటే ఒక్కసారిగా ఈ రీతిగా వైసీపీ.అధిష్టానం నిర్ణయం తీసుకోవడం వెనకాల తెలంగాణ ఎన్నికల ఫలితాలు అని ప్రచారం జరుగుతుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్ పార్టీ… ఓడిపోవడానికి ప్రధాన కారణం సిట్టింగ్ ఎమ్మెల్యేలను .మార్చకపోవటమే.దీంతో అటువంటి తప్పు ఏపీ ఎన్నికలలో జరగకూడదని వైసీపీ… ముందు జాగ్రత్తగా.స్థానిక వ్యతిరేకత కలిగిన నాయకులను పక్కన పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.