పురుషులతో పోల్చి చూస్తే మహిళలకు, యువతులకు కెరీర్ పరంగా సక్సెస్ సాధించే విషయంలో ఎన్నో అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి.దేశంలో అత్యున్నత సర్వీస్ గా భావించే సివిల్ సర్వీసెస్ పరీక్షలలో జాతీయ స్థాయిలో షాద్ నగర్ విద్యార్థిని సత్తా చాటారు.
విద్యార్థిని సుష్మిత ( Sushmita )ఎంతో కష్టపడి తన కలను నెరవేర్చుకున్నారు.సుష్మిత తండ్రి పేరు శ్రీశైలం కాగా తల్లి పేరు లక్ష్మి.
షాద్ నగర్ లోని హెరిటేజ్ వ్యాలీలో( Heritage Valley ) పదో తరగతి వరకు చదివిన సుష్మిత హైదరాబాద్ లోని పేజ్ కాలేజ్ లో ఇంటర్ పూర్తి చేశారు.వరంగల్ లోని నిట్ లో సుష్మిత అండర్ గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేశారు.
ఎంతో ఇష్టంగా సుష్మిత తన సివిల్స్ కోర్సును మొదలుపెట్టారు.పరీక్షలలో అనుకూల ఫలితాలు వచ్చినా ఇంటర్వ్యూలో సుష్మిత మెప్పించలేకపోయారు.
తాను చేసిన మూడు ప్రయత్నాలు ఫెయిల్ కాగా రెట్టింపు ఉత్సాహంతో సుష్మిత మళ్లీ ప్రిపేర్ అయ్యారు.నాలుగో ప్రయత్నంలో సుష్మిత తను అనుకున్న లక్ష్యాన్ని సాధించి వార్తల్లో నిలిచారు.నాలుగో ప్రయత్నంలో సుష్మిత మంచి ర్యాంకును సాధించడంతో పాటు ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు.నాలుగో ప్రయత్నంలో సుష్మిత 384వ ర్యాంక్ సాధించడం గమనార్హం.సుష్మిత టాలెంట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
సుష్మిత భవిష్యత్తులో మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.రేయింబవళ్లు కష్టపడటం వల్లే సుష్మిత ఒక్కో మెట్టు పైకి ఎదిగి సక్సెస్ సాధించారు.సుష్మిత సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలిచింది.
సుష్మిత భవిష్యత్తులో మరిన్ని విజయాలతో సత్తా చాటడంతో పాటు అంతకంతకూ ఎదగాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.సుష్మిత మంచి ర్యాంక్ ను సొంతం చేసుకొని తల్లీదండ్రులు గర్వపడేలా చేశారు.
తన సక్సెస్ స్టోరీతో సుష్మిత ఎంతగానో ఆకట్టుకుంటున్నారు.