Naga Chaitanya : ఆ మూవీ ఫ్లాపవుతుందని తెలిసినా నటించేవాడిని.. నాగచైతన్య షాకింగ్ కామెంట్స్ వైరల్!

అక్కినేని నాగచైతన్య( Naga Chaitanya ) తాజాగా నటించిన వెబ్ సిరీస్ దూత.భారీ అంచనాల నడుమ డిసెంబర్ 1న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల అయినా ఈ వెబ్ సిరీస్ మంచి విజయాన్ని అందుకుంది.

 Naga Chaitanya Spoke About Laal Singh Chaddha Failure-TeluguStop.com

ఈ వెబ్ సిరీస్ మంచి సక్సెస్ ను సాధించడంతో ఈ సీరిస్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు నాగచైతన్య.ఇక అందులో భాగంగానే ప్రస్తుతం వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు.

తాజాగా ఒక ఆంగ్ల మీడియాలో మాట్లాడుతూ.తన తొలి బాలీవుడ్‌ చిత్రం లాల్‌ సింగ్‌ చడ్డా( Laal Singh Chaddha ) ఫ్లాప్ కావడంపై స్పందించారు.

ఆ సినిమా ప్రేక్షకాదరణ పొందనందుకు బాధపడడం లేదని అన్నారు చైతన్య.

దూత లో నా పాత్రకు జరగబోయేవన్నీ ముందే తెలుస్తాయి.అలాగే లాల్‌ సింగ్‌ చడ్డా ఫ్లాప్ అవుతుందని నాకు ముందే తెలిసినా నేను ఆ సినిమాలో కచ్చితంగా నటించేవాడిని.ఎందుకంటే ఆ సినిమాలో నేను ఆమిర్‌ ఖాన్‌( Aamir Khan )తో కలిసి నటిస్తాను కాబట్టి ఫలితాన్ని ఆశించకుండా అంగీకరించేవాడిని.

ఆయనతో నటించి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను.అందుకే దాని ఫలితం నన్ను బాధించలేదు.ఆ చిత్రంలో నటించినందుకు ఇప్పటికీ ఆనందంగా ఉన్నాను.జీవితంలో చాలా ఒడుదొడుకులు ఉంటాయి.

అలాగే సినిమాల విషయంలో కూడా హిట్, ఫ్లాప్‌ లు సహజం.

వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగాలి అని చెప్పుకొచ్చారు నాగచైతన్య.ఇకపోతే ప్రస్తుతం నాగచైతన్య చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న తండేల్ సినిమా( Thandel )లో నటిస్తున్నారు ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది.మత్స్యకారుల జీవితం నేపథ్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతోంది.

త్వరలోనే దీని చిత్రీకరణ ప్రారంభం కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube