తెలంగాణ వ్యాప్తంగా రేపు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరగనున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కౌంటింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈ మేరకు ఖమ్మం, పాల్వంచలో రెండు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు.కాగా ఖమ్మం జిల్లాలో ఖమ్మం, వైరా, మధిర, పాలేరుతో పాటు సత్తుపల్లి నియోజకవర్గాలగా ఉన్న ఈ ఐదు నియోజకవర్గాల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది.
పాల్వంచలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు కౌంటింగ్ జరగనుంది.ఇక ఈ జిల్లాలో భద్రాచలం, అశ్వారావుపేట, పినపాక, ఇల్లందు మరియు కొత్తగూడెం నియోజకవర్గాలున్న సంగతి తెలిసిందే.
కాగా కౌంటింగ్ కోసం ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్లను అధికారులు ఏర్పాటు చేశారు.