సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.నాగర్ కర్నూల్ జిల్లా కొల్లపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె పోటీ చేయనున్నారు.
కర్నె శిరీషకు నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు అండగా నిలుస్తున్నాయి.ఈ క్రమంలోనే తాజాగా ఆమెకు పుదుచ్చేరి మాజీ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి యానాంకు చెందిన మల్లాడి కృష్ణారావు మద్దతు పలికారు.
తన ప్రచారానికి గానూ రూ.లక్ష ఆర్థిక సాయం చేశారు.ఈ సందర్భంగా మల్లాడి కృష్ణారావు మాట్లాడుతూ కుల, మతాలకు అతీతంగా డబ్బు ప్రభావం లేకుండా యువత ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలనే లక్ష్యంతో శిరీష నామినేషన్ దాఖలు చేశారని తెలిపారు.ఫలితం ఏదైనా నిరుత్సాహపడకూడదని చెప్పానన్నారు.
అదేవిధంగా శిరీష ఉన్నత చదువుల కోసం ఆర్థిక సాయం అందజేస్తానని ఆయన హామీ ఇచ్చారని తెలుస్తోంది.