మనలో ఎంతో మంది బెల్లీ ఫ్యాట్ సమస్య( Belly Fat )తో బాధపడుతున్నారు.పొట్ట వద్ద కొవ్వు పేరుకు పోవడానికి చాలా కారణాలు ఉన్నాయి.
నోటికి ఆపు లేకుండా ఏది పడితే అది తినడం, గంటలు తరబడి కూర్చుని ఉండటం, శరీరానికి శ్రమ లేకపోవడం, ఒత్తిడి తదితర కారణాలు వల్ల కొవ్వు పేరుకుపోయి పొట్ట బానలా తయారవుతుంటుంది.దీంతో శరీర ఆకృతి పూర్తిగా మారిపోతుంది.
ఈ క్రమంలోనే పొట్ట కొవ్వును కరిగించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ పొడి మీకు అద్భుతంగా సహాయపడుతుంది.రోజు ఈ పొడిని తీసుకుంటే ఎలాంటి బాన పొట్ట అయినా కరిగిపోద్ది.
మరి ఇంతకీ ఆ పొడి ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్లు మెంతులు( Fenugreek ), రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర, రెండు టేబుల్ స్పూన్లు వాము, రెండు టేబుల్ స్పూన్లు సోంపు, రెండు అంగుళాల దాల్చిన చెక్క, నాలుగు లవంగాలు( Cloves ) వేసి వేయించుకోవాలి.మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటిని చల్లారబెట్టుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్‌లో వేయించుకున్న పదార్థాలన్నీ వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.
ఈ పౌడర్ ను ఒక బాక్స్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.ఈ పొడిని ఎలా తీసుకోవాలో కూడా తెలుసుకుందాం.స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ తయారు చేసి పెట్టుకున్న పొడి వేసి పది నిమిషాల పాటు మరిగించాలి.
ఆ తర్వాత వాటర్ ను ఫిల్టర్ చేసుకుని గోరువెచ్చగా అయిన తర్వాత సేవించాలి.రోజూ ఈ విధంగా కనుక చేస్తే పొట్ట వద్ద పేరుకుపోయిన ఫ్యాట్ మొత్తం కరిగిపోతుంది.బాన పొట్ట కొద్దిరోజుల్లోనే ఫ్లాట్ గా మారుతుంది.అంతేకాదు రోజు ఈ పొడిని తీసుకోవడం వల్ల వెయిట్ లాస్( Weight Loss ) అవుతారు.మోకాళ్ళ నొప్పులు దూరమవుతాయి.ఎముకల్లో సాంద్రత పెరుగుతుంది.
మరియు ఇమ్యూనిటీ పవర్( Immunity Power ) సైతం ఇంప్రూవ్ అవుతుంది.