బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్ ధ్వజమెత్తారు.బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
బీసీలను అవమానపర్చే విధంగా మాట్లాడటంతో పాటు మోసం చేస్తున్నాయని బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు.బీసీలకు క్షమాపణ చెప్పిన తరువాతనే ఓట్లు అడగాలని తెలిపారు.
బీజేపీ బీసీలకు పెద్ద పీట వేస్తుందన్న ఆయన తమ పార్టీ బీసీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిందని పేర్కొన్నారు.అదేవిధంగా ఈనెల 7న హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బీసీ గర్జన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.