తెలుగు రాష్ట్రాలలో బొప్పాయి పంట( Papaya cultivation ) దాదాపుగా 30 వేల ఎకరాల విస్తీర్ణంలో సాగు అవుతుంది.బొప్పాయిలో పోషక విలువలు చాలా ఎక్కువ.
కాబట్టి మార్కెట్లో బొప్పాయికి మంచి డిమాండ్ ఉంది.అంతేకాదు బొప్పాయి పాల నుండి తీసిన పపయిన్ అనే ఎంజైమ్ ను మందుల తయారీలో ఉపయోగిస్తారు.
కాబట్టి రైతులు( Farmers ) బొప్పాయి పంటను సాగు చేస్తే అధిక దిగుబడులు పొందవచ్చు.
బొప్పాయి పంట సాగు( papaya crop )కు కీలకం నీటి తడులు.
నీటిని డ్రిప్ విధానం ద్వారా అందించాలి అనుకుంటే చిన్న మొక్కలకు రెండు రోజులకు ఒకసారి చొప్పున నీటి తడులు అందించాలి.పెద్ద మొక్కలైతే ప్రతిరోజు తేలికపాటి నీటి తడి అందించాలి.
రింగు పద్ధతిలో నీటి తడులు అందిస్తే వేసవికాలంలో ఆరు రోజులకు ఒకసారి, చలికాలంలో 10 రోజులకు ఒకసారి నీటి తడులు అందించాలి.
బొప్పాయి మొక్కలు నాటిన నాలుగు నెలల తర్వాత పంటకు పూత రావడం ప్రారంభమవుతుంది.ఈ సమయంలో నీటి ఎద్దడి సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.పూత వచ్చిన నాలుగు నెలలకు బొప్పాయి కాయ తయారవుతుంది.
బొప్పాయి కాయ కొద్దిగా పసుపు రంగులోకి మారిన తర్వాత అప్పుడు కోతలు చేయాలి.ఈ పరిస్థితులలో బొప్పాయి కాయలను మొక్కల మీద మాగనివ్వరాదు.
బొప్పాయి మొక్కలు నాటిన 9వ నెల నుండి రెండు సంవత్సరాల వరకు కాపు వస్తుంది.
ఎరువుల విషయానికి వస్తే.ఒక ఎకరం పొలానికి ఐదు టన్నుల పశువుల ఎరువు( Cattle manure ) వేసి కలియదున్నాలి.ఆ తర్వాత ప్రతి బొప్పాయి మొక్కకు 250 గ్రాముల యూరియా ఎరువులు ప్రతి రెండు నెలలకు ఒకసారి చొప్పున 6 మోతాదులుగా వెయ్యాలి.
ఇక పంటను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటూ ఏవైనా చీడపీడలు లేదా తెగులు( Pest ) ఆశిస్తే తొలి దశలో అరికట్టాలి.ఈ యాజమాన్య పద్ధతులను పాటిస్తే ఒక ఎకరంలో దాదాపుగా 25 టన్నుల పంట దిగుబడి పొందవచ్చు
.