మహేష్ బాబు - సౌందర్య కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా అదేనా..?

సూపర్ స్టార్ కృష్ణ( Superstar Krishna ) కొడుకుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినా మహేష్ బాబు, ఆ తర్వాత తండ్రినే మించిన తనయుడిగా మారిన సంగతి అందరికీ తెలిసిందే.బాలనటుడిగా ఉన్నప్పుడే మహేష్ బాబు అందరి దృష్టిలో పడ్డాడు.

 Is That The Missing Movie In Mahesh Babu Soundarya Combination , Mahesh Babu-TeluguStop.com

ఆలా స్టార్ కిడ్ గా మంచి పేరు తెచ్చుకున్న మహేష్ బాబు కి చిన్నతనం లోనే లెజండరీ నటీనటులతో నటించే అవకాశం దక్కింది.అంత అనుభవం ఉన్న నటీనటులతో కలిసి చిన్నతనం లోనే నటించడం వల్ల మహేష్ నటనలో రాటుదేలాడు.

ఇక హీరో అయ్యాక మొదటి సినిమాతోనే ఆయన ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రీతీ జింటా తో కలిసి ‘రాజకుమారుడు’ సినిమా చేసాడు.మొదటి చిత్రం తోనే బంపర్ హిట్ కొట్టిన మహేష్ బాబు కి రెండవ చిత్రం ‘యువరాజు’ ( Yuvaraju )కోసం హీరోయిన్ల గాలింపు చేసాడు డైరెక్టర్ వై వీ ఎస్ చౌదరీ.

ఈ చిత్రం లో హీరోయిన్స్ గా సిమ్రాన్ మరియు సాక్షి శివానంద్( Sakshi Shivanand ) నటించారు.

Telugu Mahesh Babu, Rajakumarudu, Simran, Soundarya, Krishna, Tollywood, Yuvaraj

అయితే తొలుత ఈ చిత్రం లో సిమ్రాన్ ( Simran )పాత్ర కోసం అప్పటి స్టార్ హీరోయిన్ సౌందర్య ని అనుకున్నారట. సౌందర్య మహేష్ బాబు కంటే వయస్సు లో పెద్ద.వయస్సు ఒక సమస్యే కాదు అనుకోండి, ఆ మాటకి వస్తే మహేష్ బాబు కంటే ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ మూడేళ్లు పెద్ద.

కలిసి సినిమా చేసారు, ప్రేమించుకున్నారు, పెళ్లి కూడా చేసుకున్నారు.అయితే మహేష్ తో సినిమా అనగానే సౌందర్య చాలా సంతోష పడింది కానీ, ఫోటో షూట్ చేసిన తర్వాత ఎందుకో కెమిస్ట్రీ కుదరడం లేదు, ఏ యాంగిల్ లో చూసిన మహేష్ కి జోడిగా ( Mahesh Babu )అనిపించడం లేదు, అక్కలాగానే ఉన్నాను అని డైరెక్టర్ వై వీ ఎస్ చౌదరి కి చెప్పిందట ఆమె.ఆయనకీ కూడా అదే ఫీలింగ్ కలిగింది.ఈ సినిమా నాకంటే కూడా సిమ్రాన్ కి పర్ఫెక్ట్ గా ఉంటుందని, ఆమెని కలిసి స్టోరీ వినిపించండి అంటూ సౌందర్య( Soundarya ) నే సలహా ఇచ్చిందట.

Telugu Mahesh Babu, Rajakumarudu, Simran, Soundarya, Krishna, Tollywood, Yuvaraj

సిమ్రాన్ వయస్సు మహేష్ కంటే కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే తక్కువ.అయ్యినప్పటికే జోడి పర్ఫెక్ట్ గా కుదిరింది, ఆ పాత్రకి ఆమె మాత్రమే న్యాయం చెయ్యగలదు అని ఫోటో షూట్ చేసిన తర్వాత అర్థం అయ్యిందట.అలా ప్రారంభమై షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలైన ఈ సినిమాకి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది కానీ, కమర్షియల్ గా మహేష్ కెరీర్ లో పెద్ద ఫ్లాప్ అయ్యింది.ఈ సినిమాలోని పాటలు మాత్రం అప్పట్లో పెద్ద హిట్ అయ్యాయి.

ఇప్పటికీ కూడా మహేష్ ఫ్యాన్స్ కి మహేష్ కెరీర్ బాగా ఇష్టమైన ఆల్బమ్స్ లో ‘యువరాజు’ కచ్చితంగా ఉంటుంది అని చెప్పొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube