ఇలాంటి వాళ్ళే రేపిస్ట్ లు అవుతున్నారు...అనసూయ పోస్ట్ వైరల్!

బుల్లి తెరపై యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అనసూయ ( Anasuya ) ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వెండి తెర సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇలా వెండితెరపై సినిమాలలో నటిస్తున్నటువంటి ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

 Anasuya Gives Clarity On Why She Hates Calling Aunty , Anasuya, Aunty, Rapist, T-TeluguStop.com

ఈ సందర్భంగా ఈమె ఆంటీ ( Aunty ) అనే పదం గురించి మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు.గతంలో చాలామంది ఈమెను ఆంటీ అంటూ ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఆంటీ అనే పదం ట్విట్టర్లో కూడా ట్రెండ్ అయ్యేలా ఈమెను ట్రోల్ చేశారు.తాజాగా ఈమె ఆంటీ అనే పదం తనకు ఎందుకు నచ్చదు అనే విషయాల గురించి మాట్లాడుతూ పలు విషయాలు తెలిపారు.

Telugu Anasuya, Aunty, Rapist, Tollywood-Movie

ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ ఆంటీ అనే పదం నాకు ఎందుకు నచ్చదు అనే విషయం గురించి మాట్లాడుతూ.నేను ఏదైనా ఒక పోస్ట్ చేస్తే చాలా మంది ఇవన్నీ మీకు అవసరమా ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోవచ్చు కదా ఆంటీ అంటూ కామెంట్లు చేస్తారు.అయితే చిన్నపిల్లలు ఆంటీ అంటే నేను కూడా బాధపడను కానీ నా ఏజ్ తో సమానంగా ఉన్న వాళ్ళు నన్ను ఆంటీ అని పిలవడం నాకు నచ్చదు.నేను కూడా చాలామందిని ఆంటీ అని పిలిచే దాన్ని అయితే వాళ్లకు నచ్చదు అని తెలిస్తే నేను పిలవను.

Telugu Anasuya, Aunty, Rapist, Tollywood-Movie

నాకు ఏదో కారణంతో నచ్చట్లేదు, నేను అదే చెప్పాను.అయినా మళ్ళీ మళ్ళీ ఎందుకు అనాలి.అవతలి వాళ్ళని ఎందుకు హార్ట్ చేయాలి.అలాంటి పైశాచిక ఆనందం ఎందుకు.నా మీద కామెంట్స్ వేసేవాడ్ని ఫేస్ టు ఫేస్ జన్మలో చూస్తానో కూడా లేదో తెలియదు.అయినా నా మీదే అంత కోపం ఉంటే వాళ్ళ చుట్టు పక్కన ఉన్న ఆడవాళ్ళని ఇంకెలా చూస్తాడు.

ఇలాంటి వాళ్ళే ఫ్యూచర్ లో రేపిస్ట్ ( Rapist )లు అవుతారు అంటూ  ఈ సందర్భంగా అనసూయ ఆంటీ అనే పదం తనకు ఎందుకు నచ్చదనే విషయాలను తెలియజేస్తూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube