నందమూరి నటసింహం బాలకృష్ణ ( Nandamuri Balakrishna ) ఏ సినిమా చేసిన ఈ తిరుగులేని విజయం సాధిస్తుంది.ఏ డైరెక్టర్ అయినా ఈయనకు పెర్ఫెక్ట్ కథను అందిస్తుండడంతో బాలయ్యకు తిరుగులేని విజయం అందుతుంది.
ఇప్పుడున్న సీనియర్ హీరోల్లో ఫుల్ ఫామ్ తో ఆకట్టుకుంటున్న హీరో ఎవరు అంటే బాలయ్య అనే చెప్పాలి.మరి తాజాగా బాలకృష్ణ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
దసరా సీజన్ లో బరిలోకి దిగిన సినిమాల్లో ‘‘భగవంత్ కేసరి’‘ ( Bhagavanth Kesari ) ఒకటి.సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ”భగవంత్ కేసరి”.
ఈ సినిమాపై ముందు నుండి నందమూరి ఫ్యాన్స్ బాగా హోప్స్ పెంచేసుకున్నారు.
మరి అనుకున్నట్టుగానే అక్టోబర్ 19న గ్రాండ్ గా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా రిలీజ్ అయ్యిన ఈ సినిమాకు అన్ని వర్గాల నుండి మంచి రెస్పాన్స్ లభించడంతో మొదటి రెండు వారాలు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది.ఇక నిన్నటి నుండి మూడవ వారం లోకి అడుగు పెట్టింది.బాలయ్య ఈ సినిమా ఆడియెన్స్ ను బాగా అలరించింది.
దీంతో 130 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది.దీంతో ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అయిన సందర్భంగా సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేయనున్నారని తెలుస్తుంది.నవంబర్ 9న భగవంత్ కేసరి సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో గ్రాండ్ గా ఏర్పాటు చేయనున్నారట.ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ ( Kajal Aggarwal) నటించగా కూతురు రోల్ లో శ్రీలీల,( Sreeleela ) విలన్ గా బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్( Arjun Rampal ) నటించారు.
ఇక షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించగా థమన్ సంగీతం అందించారు.